ఆస్ట్రేలియాకు హిట్‌మ్యాన్‌
close

ప్రధానాంశాలు

Updated : 12/12/2020 06:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్ట్రేలియాకు హిట్‌మ్యాన్‌

ఫిట్‌నెస్‌ పరీక్షలో రోహిత్‌ పాస్‌
చివరి 2 టెస్టుల్లో బరిలో దిగే అవకాశం
ఈనెల 14న ప్రత్యేక విమానంలో పయనం

దిల్లీ: టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌శర్మ ఆస్ట్రేలియా పర్యటనపై అనిశ్చితి తొలగింది. ఫిట్‌నెస్‌ అడ్డంకులు తప్పిపోవడంతో టీమ్‌ఇండియాలో రోహిత్‌ చేరికకు మార్గం సుగమం అయింది. శుక్రవారం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో రోహిత్‌కు ఫిట్‌నెస్‌ పరీక్ష జరిగింది. ‘‘ఫిట్‌నెస్‌ పరీక్షలో రోహిత్‌ పాసయ్యాడు. త్వరలోనే ఆసీస్‌కు పయనమవుతాడు’’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి తెలిపాడు. ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సమక్షంలో రోహిత్‌కు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించారు. రోహిత్‌ బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, ఫిట్‌నెస్‌పై సంతృప్తి చెందిన ద్రవిడ్‌ అతడి ప్రయాణానికి పచ్చజెండా ఊపాడు. ఈనెల 17న అడిలైడ్‌లో తొలి టెస్టు ప్రారంభమవుతుండగా.. 14న రోహిత్‌ ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి దుబాయ్‌కు వెళ్తాడు. అట్నుంచి సిడ్నీ చేరుకుంటాడు. చివరి రెండు టెస్టులకు జట్టుకు రోహిత్‌ అందుబాటులో ఉంటాడు. ఆస్ట్రేలియాలో నిబంధనల ప్రకారం రోహిత్‌కు 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి. క్వారంటైన్‌ ముగిసిన వెంటనే అతడు టీమ్‌ఇండియాతో చేరతాడు. జట్టుతో పాటు ఉంటూ సాధన చేస్తాడు. జనవరి 7న సిడ్నీలో ప్రారంభమయ్యే మూడో టెస్టులో బరిలో దిగుతాడు. భార్య అనుష్కశర్మ బిడ్డకు జన్మనిస్తుండటంతో తొలి టెస్టు అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్వదేశానికి రానున్నాడు. కోహ్లి గైర్హాజరీ నేపథ్యంలో రోహిత్‌ వంటి సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సేవలు జట్టుకు ఉపయోగమే.

ఇవీ చదవండి..

ఆల్‌రౌండర్‌ బుమ్రా..!

ఆ అయిదు రోజులూ అదే పాట..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన