రహానెపై ఎలాంటి ఒత్తిడి ఉండదు
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 15/12/2020 01:13 IST

రహానెపై ఎలాంటి ఒత్తిడి ఉండదు

దిల్లీ: ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టుల్లో టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించనున్న రహానెపై కెప్టెన్సీ ఒత్తిడి ఉండదని భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.      ‘‘రహానెపై ఒత్తిడి ఉండనే ఉండదు. ఇంతకుముందు అతడు నాయకత్వం వహించిన రెండు సార్లూ భారత జట్టు గెలిచింది. ఆస్ట్రేలియాపై, అఫ్గానిస్థాన్‌పై జట్టును నడిపించి రహానె విజయాన్నందించాడు. కాబట్టి కెప్టెన్‌గా అతడిపై ఒత్తిడి ఉంటుందని నేననుకోను. ఎందుకంటే మూడు టెస్టుల కోసం తాను తాత్కాలిక సారథినని అతడికి తెలుసు. కెప్టెన్‌గా ఆడుతున్నానని రహానె అనుకుంటాడని నేను భావించట్లేదు. అతడి బుర్రలో ఆ ఆలోచనే ఉండకపోవచ్చు’’ అని గావస్కర్‌ అన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన