close

ప్రధానాంశాలు

Published : 13/01/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా కలకలం

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో గందరగోళం
సైనా, ప్రణయ్‌లకు తొలుత పాజిటివ్‌.. తర్వాత నెగెటివ్‌
బ్యాంకాక్‌

పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైన బ్యాడ్మింటన్‌లో కరోనా కలకలం రేపింది. యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీలో బరిలో నిలిచిన భారత బృందంలో కరోనా పరీక్షల ఫలితాలు గందరగోళం సృష్టించాయి. భారత స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌, ప్రణయ్‌లకు తొలుత పాజిటివ్‌ రావడం భారత జట్టును షాక్‌కు గురిచేసింది. నమూనాల తిరిగి పరీక్షించిన అనంతరం ప్రణయ్‌కు నెగెటివ్‌ రాగా.. సైనాకు మళ్లీ పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం మరోసారి నిర్వహించిన పరీక్షల్లో సైనాకు నెగటివ్‌ రావడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. కొవిడ్‌ కారణంగా సైనాతో పాటు ఆమె భర్త పారుపల్లి కశ్యప్‌లు టోర్నీకి దూరమైనట్లు మొదట ప్రకటించారు. వారి మ్యాచ్‌ల్ని వాకోవర్‌ ఇచ్చారు. అయితే సైనాకు తిరిగి నెగెటివ్‌ రావడంతో ఆమెతో పాటు కశ్యప్‌ ఆడాల్సిన మ్యాచ్‌ల్ని బుధవారానికి రీషెడ్యూల్‌ చేశారు. చివరగా చేసిన పీసీఆర్‌ టెస్ట్‌, యాంటీబాడీ టెస్టులు ప్రణయ్‌, సైనాలకు మార్గం సుగమం చేశాయి. వారి పీసీఆర్‌ పరీక్ష పాజిటివ్‌ వచ్చింది. కానీ యాంటీబాడీ ఐజీజీ కూడా పాజిటివే. అంటే దానర్థం ఆ వ్యక్తికి గతంలో వైరస్‌ వచ్చి పోయిందన్నమాట. ప్రస్తుతం వారికి ఇన్‌ఫెక్షన్‌ లేదని అర్థం. ఎల్గమల్‌     అనే షట్లర్‌ పీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌ రాగా..యాంటీబాడీ ఐజీజీ నెగెటివ్‌ వచ్చింది. అంటే అతడు ఇప్పుడే వైరస్‌ బారిన పడ్డాడని అర్థం. దీంతో ఎల్గమల్‌ టోర్నీకి దూరమయ్యాడు. ‘‘నాలుగో రౌండ్‌ పరీక్షల్లో కొవిడ్‌-19 లేదని తేలడంతో సైనా, ప్రణయ్‌లు టోర్నీలో ఆడేందుకు మార్గం సుగమం అయింది. నెగెటివ్‌ వస్తే వాకోవర్‌ ఇవ్వకుండా మ్యాచ్‌లు తిరిగి నిర్వహించే విధంగా ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్‌)ను భారత బ్యాడ్మింటన్‌ సంఘం ఒప్పించింది. సైనా, కశ్యప్‌ల మ్యాచ్‌లు బుధవారం జరుగుతాయి. అయితే మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల ఫలితాలపై కశ్యప్‌ మ్యాచ్‌ ఆధారపడి ఉంటుంది’’ అని బాయ్‌ తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన