close

ప్రధానాంశాలు

Updated : 14/01/2021 02:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అజహరుద్దీన్‌ 37 బంతుల్లో శతకం

ముంబయి: ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో కేరళ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ విధ్వంసం సృష్టించాడు. 37 బంతుల్లోనే శతకం సాధించి ఔరా అనిపించాడు. ముంబయి బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిన అజహర్‌ (137 నాటౌట్‌; 54 బంతుల్లో 9×4, 11×6).. ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లు బాదేశాడు. అతడి వీరవిహారంతో బుధవారం జరిగిన మ్యాచ్‌ (ఎలైట్‌, గ్రూప్‌ ఈ)లో కేరళ 8 వికెట్ల తేడాతో ముంబయిని చిత్తు చేసింది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఆదిత్య తారె (42), యశస్వి జైస్వాల్‌ (40) రాణించడంతో మొదట ముంబయి 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. అజహరుద్దీన్‌ (37 బంతుల్లో) టోర్నీ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం చేశాడు. రికార్డు రిషబ్‌ పంత్‌ (32 బంతుల్లో) పేరిట ఉంది.
పునీత్‌ 51 బంతుల్లో 146: కెప్టెన్‌ పునీత్‌ బిష్ఠ్‌ (146 నాటౌట్‌; 51 బంతుల్లో 6×4, 17×6) చెలరేగడంతో మరో మ్యాచ్‌ (ప్లేట్‌ గ్రూప్‌)లో మేఘాలయ 130 పరుగుల తేడాతో మిజోరాంను చిత్తు చేసింది. పునీత్‌ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అతడి జోరుతో మొదట మేఘాలయ 6 వికెట్లకు 230 పరుగులు చేసింది. ఛేదనలో మిజోరాం 9 వికెట్లకు 100 పరుగులే చేయగలిగింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన