
ప్రధానాంశాలు
బీసీసీఐ ఒత్తిడితో సీఏ చర్యలు
ముంబయి: బ్రిస్బేన్ హోటల్లో టీమ్ఇండియా ఆటగాళ్లకు కనీస వసతులు కల్పించాలన్న బీసీసీఐ ఒత్తిడికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తలొగ్గింది. భారత ఆటగాళ్లకు జిమ్, స్విమ్మింగ్‌పూల్, రూమ్ సర్వీస్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా బుధవారం సీఏ చర్యలు ప్రారంభించింది. అయితే గబ్బా స్టేడియానికి 4 కిమీ దూరంలో ఉన్న ఐదు నక్షత్రాల హోటల్లో హౌస్ కీపింగ్, రూమ్ సర్వీస్ వంటి సేవలు ఇంకా మొదలుకాలేదని టీమ్ఇండియా వర్గాలు తెలిపాయి. ‘‘బుధవారం రాత్రి 8 గంటల వరకు ఎలాంటి సేవలు ప్రారంభంకాలేదు. గురువారం ఉదయం వరకు పరిస్థితులు చక్కబడుతాయని ఆశిస్తున్నాం. టెస్టు మ్యాచ్ ప్రారంభమైతే ఆటగాళ్లు ఎక్కువసేపు మైదానంలోనే ఉంటారు. ఆలోచించడానికి కూడా వాళ్లకు సమయం దొరకదు. ఎలాంటి కారణంగా లేకుండా 48 గంటల పాటు ఆటగాళ్లను మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. సీఏ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయాల్సింది’’ అని జట్టు వర్గాలు చెప్పాయి. బ్రిస్బేన్ హోటల్లో టీమ్ఇండియాకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై మంగళవారం సీఏ ప్రతినిధులతో బీసీసీఐ ఉన్నతాధికారులు వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది.
ప్రధానాంశాలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భారత్ చిరస్మరణీయ విజయం..
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
