
ప్రధానాంశాలు
ఒక్క స్టంపే పెట్టి..
హైదరాబాద్: లాక్డౌన్లో పడిన కష్టమే టీమ్ఇండియా పేసర్ సిరాజ్‌ను ప్రమాదకర బౌలర్‌గా మార్చింది. ఆ సమయంలో అతను ఒకే స్టంప్‌ను లక్ష్యంగా పెట్టుకుని బౌలింగ్ చేశాడట! ఆ విషయాన్ని స్వయంగా అతనే వెల్లడించాడు. ‘‘2019 ఐపీఎల్లో రాణించకపోవడంతో ఈ సీజన్ నాకెంతో కీలకమని తెలుసు. అందుకే లాక్డౌన్లో బౌలింగ్ మెరుగుపర్చుకోవడంపై పూర్తి దృష్టి సారించా. ఒకే స్టంప్ పెట్టుకుని చాలా ప్రాక్టీస్ చేశా. అందుకే నిరుడు ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేయగలిగా’’ అని సిరాజ్ తెలిపాడు. మరోవైపు ఆస్ట్రేలియాలో సిరాజ్ ప్రదర్శనపై భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘సిరాజ్ ప్రదర్శన వెనుక బౌలింగ్ కోచ్ అరుణ్ కీలకంగా వ్యవహరించాడు. హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా అతను ఉన్నప్పటి నుంచి సిరాజ్‌ను ప్రోత్సహిస్తూ వచ్చాడు. ముడి సరుకులా ఉన్న అతణ్ని.. మెరుగైన వజ్రంలా మార్చాడు’’ అన్నాడు. సిరాజ్‌ను మొదట్లో చూసినపుడు అతను కనీసం రాష్ట్ర జట్టుకైనా ఆడతాడని అనుకోలేదని, కానీ అతనెంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడని ఒకప్పటి హైదరాబాద్ కోచ్ అబ్దుల్ అజీమ్ పేర్కొన్నాడు.
ప్రధానాంశాలు
సినిమా
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: రాజేంద్రప్రసాద్
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- ఐపీఎల్ 2021 భారత్‌లో.. అంతా బయటే
- సచిన్ వదిలేశాడు.. ధోనీ అందిపుచ్చుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
