close

ప్రధానాంశాలు

Published : 27/01/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఛాంపియన్‌ చిత్తు

పంజాబ్‌ చేతిలో కర్ణాటకకు పరాభవం

అహ్మదాబాద్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టీ20 క్రికెట్‌ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కర్ణాటకకు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో పంజాబ్‌ 9 వికెట్ల తేడాతో కర్ణాటకను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక 17.2 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. సిద్ధార్థ్‌ కౌల్‌ (3/15), సందీప్‌శర్మ (2/17), అర్ష్‌దీప్‌ (2/16), రమణ్‌దీప్‌సింగ్‌ (2/22) ఆ జట్టును దెబ్బ తీశారు. ప్రభ్‌సిమ్రన్‌సింగ్‌ (49 నాటౌట్‌), మన్‌దీప్‌సింగ్‌ (35 నాటౌట్‌) పంజాబ్‌ 12.4 ఓవర్లలో ఒక వికెటే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
సెమీస్‌లో తమిళనాడు: ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తమిళనాడు సెమీస్‌ చేరింది. క్వార్టర్స్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో హిమాచల్‌ ప్రదేశ్‌ను ఓడించింది. మొదట సోను (3/14), సందీప్‌ (2/32)ల ధాటికి హిమాచల్‌ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసింది. అపరాజిత్‌ (52 నాటౌట్‌), షారుఖ్‌ (40 నాటౌట్‌) రాణించంతో తమిళనాడు 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన