close

ప్రధానాంశాలు

Published : 27/01/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పడగొట్టి.. పడింది

దక్షిణాఫ్రికా 220 ఆలౌట్‌.. పాకిస్థాన్‌ 33/4

కరాచి: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో 13 ఏళ్ల తర్వాత ఆడుతున్న టెస్టు సిరీస్‌ను బౌలర్ల ప్రతిభతో పాకిస్థాన్‌ బాగానే ఆరంభించినా.. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం ఆ జట్టును ఆత్మరక్షణలో పడేలా చేసింది. రెండు టెస్టుల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో మంగళవారం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా జట్టును 220 పరుగులకే ఆలౌట్‌ చేసిన ఆనందం పాక్‌కు ఎంతోసేపు నిలవలేదు. చివరి సెషన్లో 18 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య జట్టు 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇమ్రాన్‌ బట్‌ (9), అబిద్‌ అలీ (5)లతో పాటు కొత్త కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (7) సైతం ఔటైపోయాడు. అంతకుముందు స్పిన్నర్లు యాసిర్‌ షా (3/54), నౌమన్‌ అలీ (2/38), పేసర్‌ షహీన్‌ అఫ్రిది (2/49)ల ధాటికి దక్షిణాఫ్రికా 69.2 ఓవర్లలో 220 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (58; 106 బంతుల్లో 9×4) మినహా ఎవరూ అర్ధశతకం సాధించలేదు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన