
ప్రధానాంశాలు
జాతీయ టీటీ ఛాంప్ సత్యన్
స్నేహిత్‌కు కాంస్యం
పంచకుల: భారత టీటీ స్టార్ సత్యన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అతడు తొలిసారి జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ సొంతం చేసుకున్నాడు. మంగళవారం ఫైనల్లో సత్యన్ 4-2 (11-6, 11-7, 10-12, 7-11, 11-8, 11-8)తో తొమ్మిదిసార్లు ఛాంపియన్ శరత్ కమల్‌పై నెగ్గి టైటిల్ కైవసం చేసుకున్నాడు. అంతకుముందు సెమీఫైనల్లో సత్యన్ తెలంగాణ కుర్రాడు ఫిదెల్ ఆర్.స్నేహిత్ జోరుకు బ్రేకులు వేశాడు. సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకున్న స్నేహిత్ కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్నేహిత్ 0-4 (11-13, 5-11, 9-11, 5-11)తో సత్యన్ చేతిలో ఓడాడు. మరో సెమీస్‌లో శరత్ కమల్ 4-2 (11-8, 5-11, 14-12, 11-9, 9-11, 17-15) మానవ్ ఠక్కర్‌పై గెలిచాడు. ఇంతకుముందు 2014, 2015లో సత్యన్ ఫైనల్లో ఓడిపోయాడు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- నమ్మించి మోసం చేశారు: జయలలిత
- శశికళ సంచలన నిర్ణయం
- డ్యాన్స్‌తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ..!
- రాశీఖన్నా వింతకోరిక.. సారా డైలీడోస్
- నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రాబోయే సినిమాలివే..
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- గంటా స్పందనపై విజయసాయిరెడ్డి కౌంటర్
- ఇంట్లో తెలిసిపోతుందనే డిగ్రీ విద్యార్థిని ‘కట్టు’కథ
- ఆలుమగల మధ్య అమెరికా చిచ్చు
- హీరోయిన్స్ కాదు కానీ.. నెట్టింట్లో స్టార్సే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
