close

ప్రధానాంశాలు

Published : 01/03/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రోహిత్‌ కెరీర్‌లో ఉత్తమంగా..

దుబాయ్‌: భారత స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌శర్మ టెస్టుల్లో కెరీర్‌ ఉత్తమ ర్యాంకు సాధించాడు. ఐసీసీ తాజా బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో హిట్‌మ్యాన్‌ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన డేనైట్‌ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసిన రోహిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 25 పరుగులు సాధించాడు. దీంతో రేటింగ్‌ పాయింట్లను 742కు పెంచుకున్న అతడు.. పదో స్థానంలో ఉన్న పుజారా (708)ను దాటి ముందుకెళ్లాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (836) అయిదో ర్యాంకులో ఉండగా.. న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ (919) నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. బౌలర్ల జాబితాలో లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌పటేల్‌, ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ర్యాంకులు మెరుగుపరుచుకున్నారు. అహ్మదాబాద్‌ టెస్టులో 11 వికెట్లు తీసిన అక్షర్‌..30 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంకుకు చేరుకోగా, 7 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌.. నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానంలో నిలిచాడు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ (118) నంబర్‌వన్‌గా ఉండగా.. భారత్‌ (118), ఆస్ట్రేలియా (113) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన