
ప్రధానాంశాలు
ఆఖరి సమర సన్నాహం
ముమ్మర ప్రాక్టీస్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు
అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుకు టీమ్ఇండియా ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. గురువారం మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆరంభం కానున్న నాలుగో టెస్టు కోసం జోరుగా ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. ఆటగాళ్లు సోమవారం మైదానంలో చెమటోడ్చారు. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రహానె, ఓపెనర్ రోహిత్ శర్మ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. భారత జట్టు ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్టు చేసింది. కోహ్లి, రహానె, రోహిత్.. పేసర్లు, స్పిన్నర్ల బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. కోహ్లి, రోహిత్‌తో కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ కనిపించాడు. గులాబి బంతితో అదే మైదానంలో జరిగిన మూడో టెస్టులో 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ అక్షర్ పటేల్.. తన అస్త్రాలకు మరింత పదును పెట్టే దిశగా సాగుతున్నాడు. ఆ తర్వాత ఆటగాళ్లు ఫీల్డింగ్ ప్రాక్టీస్ కూడా చేశారు. రోహిత్, రహానె స్లిప్పులో క్యాచ్‌లు పట్టడంలో మునిగిపోయారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో ఉన్న కోహ్లి సేన చివరి టెస్టును డ్రా చేసుకున్నా ఆ తుది సమరానికి అర్హత సాధించడంతో పాటు ఈ సిరీస్‌నూ సొంతం చేసుకుంటుంది.
మరిన్ని
సినిమా
- ‘వకీల్ సాబ్’కు మహేశ్‌బాబు ప్రశంసలు
- తక్కువ ఖర్చుతో వినూత్న ఇల్లు
- హోం క్వారంటైన్లో పవన్
- పవన్.. మీకు ఈ మాట చెప్పమన్నారు: దిల్‌రాజు
- అదే టిప్పర్.. అదే డ్రైవర్
- ఉప్పెన.. కృతి ఇంత కష్టపడిందా!
- ప్చ్.. ఇది వాళ్ల వ్యక్తిగతం
- మెహ్రీన్ లవ్ ప్రపోజ్.. నజ్రియా దాగుడుమూతలు
- మా కరోనా టీకాలకు అంత సీన్ లేదు!
- దిల్లీ దంచేసింది
ఎక్కువ మంది చదివినవి (Most Read)
