close

ప్రధానాంశాలు

Published : 04/03/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ ఇద్దరిలో బాంటన్‌ ఒకడు

కరాచి: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో ఫవాద్‌ అహ్మద్‌ (ఆస్ట్రేలియా) కాకుండా కరోనా బారిన పడ్డ మరో ఇద్దరు విదేశీ క్రికెటర్లలో ఒకరు ఇంగ్లాండ్‌ యువ ఓపెనర్‌ టామ్‌ బాంటన్‌గా తేలింది. తనకు కరోనా సోకినట్లు అతను బుధవారం ట్వీట్‌ చేశాడు. సోమవారం ఫవాద్‌ అహ్మద్‌కు పాజిటివ్‌గా తేలగా.. మంగళవారం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో పాటు ఓ సహాయ సిబ్బందికి వైరస్‌ సోకినట్లు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మీడియా డైరెక్టర్‌ సామి బర్నీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే అతను వాళ్ల పేర్లు బయటపెట్టలేదు. కానీ తనకు కరోనా సోకిందని, ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని పీఎస్‌ఎల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌ తరపున ఆడుతున్న బాంటన్‌ తాజాగా ట్వీట్‌ చేశాడు. ‘‘దురదృష్టవశాత్తూ నాకు కరోనా సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న నేను పీఎస్‌ఎల్‌ నిబంధనలు పాటిస్తున్నా. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. పీసీబీ, క్వెట్టా గ్లాడియేటర్స్‌ నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు’’ అని అతను పేర్కొన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన