close

ప్రధానాంశాలు

Published : 04/03/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాహుల్‌ రెండులోనే టీ20 ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో టీమ్‌ఇండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 816 పాయింట్లతో అతను.. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ (915) తర్వాతి స్థానంలో ఉన్నాడు. మరోవైపు కెప్టెన్‌ కోహ్లి (697) ఓ స్థానం మెరుగై ఆరో ర్యాంకు సాధించాడు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (801), ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల జట్ల సారథి ఆరోన్‌ ఫించ్‌ (788), దక్షిణాఫ్రికా ఆటగాడు వాన్‌ డెర్‌ డసన్‌ (700) వరుసగా మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచారు. మరోవైపు బౌలర్ల జాబితాలో ఒక్క భారత బౌలర్‌ కూడా టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు. వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా వరుసగా 13, 16వ ర్యాంకుల్లో ఉన్నారు. అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (736) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, భారత్‌ వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన