close

ప్రధానాంశాలు

Published : 04/03/2021 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిక్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లరు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. బుధవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సింధు 21-16, 21-19తో ఇగిత్‌ నెస్లిహాన్‌ (టర్కీ)పై విజయం సాధించింది. రెండో సీడ్‌ సింధు తర్వాతి పోరులో ఇరిస్‌ వాంగ్‌ (అమెరికా)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో నాలుగో సీడ్‌ శ్రీకాంత్‌ 18-21, 21-18, 21-11తో సహచర ఆటగాడు సమీర్‌ వర్మపై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో సౌరభ్‌వర్మ 21-19, 21-18తో క్రిస్టియన్‌ (స్విట్జర్లాండ్‌)పై గెలిచాడు. పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి జోడీ 21-18, 19-21, 21-16తో క్రిస్టోఫర్‌- మాథ్యూ (స్కాట్లాండ్‌) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన