ఫిట్‌నెస్‌ పరీక్షలో వరుణ్‌ మళ్లీ విఫలం
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 11/03/2021 01:25 IST

ఫిట్‌నెస్‌ పరీక్షలో వరుణ్‌ మళ్లీ విఫలం

అహ్మదాబాద్‌: టీమ్‌ఇండియాను ఫిట్‌నెస్‌ సమస్యలు వీడట్లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో ఎంతమంది ఆటగాళ్లు గాయపడి ఆటకు దూరమయ్యారో తెలిసిందే. వారిలో ఇప్పటికీ కొంతమంది కోలుకోలేదు. తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ సమస్యలు తలెత్తాయి. గత ఏడాది ఐపీఎల్‌లో సత్తా చాటి ఆస్ట్రేలియాతో టీ20లకు ఎంపికైనప్పటికీ.. ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమై ఆ పర్యటనకు వెళ్లలేకపోయిన తమిళనాడు స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి పరిస్థితి ఇప్పటికీ మెరుగుపడలేదు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో మరో అవకాశం అందుకున్న అతను.. మళ్లీ ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో ఈ సిరీస్‌కు కూడా అతను దూరం కాక తప్పలేదు. మరోవైపు ఆస్ట్రేలియాలో ఆకట్టుకున్న పేసర్‌ నటరాజన్‌ సైతం భుజం నొప్పితో ఇబ్బందిపడుతున్నాడు.  కొన్ని రోజులుగా ఎన్‌సీఏలోనే ఉంటున్నాడు. అతడి ఫిట్‌నెస్‌పైనా స్పష్టత లేదు. ఇంగ్లాండ్‌తో తొలి టీ20 శుక్రవారం జరగనుండగా.. అతను ఇప్పటికీ జట్టుతో   కలవని నేపథ్యంలో ఈ సిరీస్‌కు దూరమైనట్లే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన