పృథ్వీ మెరుపులు
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 12/03/2021 01:28 IST

పృథ్వీ మెరుపులు

విజయ్‌ హజారె ఫైనల్లో ముంబయి

దిల్లీ: ముంబయి సారథి పృథ్వీ షా (165; 122 బంతుల్లో 17×4, 7×6) మరో అసాధారణ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మెరుపు శతకంతో విజయ్‌ హజారె ట్రోఫీ వన్డే టోర్నీలో ముంబయిని ఫైనల్‌కు చేర్చాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో   ఆ జట్టు 72 పరుగుల ఆధిక్యంతో కర్ణాటకను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 49.2 ఓవర్లలో 322 పరుగులు సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పృథ్వీ సూపర్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో అతడికి ఇది నాలుగో సెంచరీ. అనంతరం కర్ణాటక 42.4 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. దేవదత్‌ పడిక్కల్‌ (64; 64 బంతుల్లో 9×4, 1×6), శరత్‌ (61; 39 బంతుల్లో 8×4, 2×6) పోరాడినా ఫలితం లేకపోయింది. మరో సెమీస్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌ ఐదు వికెట్ల తేడాతో గుజరాత్‌పై గెలుపొందింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 48.1 ఓవర్లలో 184 పరుగులకు కుప్పకూలింది.  బదులుగా ఉత్తర్‌ప్రదేశ్‌ 42.4 ఓవర్లలో అయిదు వికెట్టు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అక్ష్దీప్‌ నాథ్‌ (71; 104 బంతుల్లో 8×4) సత్తాచాటి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈనెల 14న దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగే ఫైనల్లో ముంబయితో ఉత్తర్‌ప్రదేశ్‌ తలపడుతుంది.

754

ఈసారి విజయ్‌ హజారే టోర్నీలో పృథ్వీ షా పరుగులు. మయాంక్‌ అగర్వాల్‌ (2017-18లో 723) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అతడు తిరగరాశాడు. దేవదత్‌ పడిక్కల్‌ (737) కూడా మయాంక్‌ను అధిగమించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన