అప్పుడు అండర్సన్‌.. ఇప్పుడు ఆర్చర్‌
Array ( [0] => stdClass Object ( [video_type] => 3 [video_short_link] => 1370395333277052930 ) ) 1

ప్రధానాంశాలు

Updated : 13/03/2021 09:19 IST

అప్పుడు అండర్సన్‌.. ఇప్పుడు ఆర్చర్‌

నాలుగో టెస్టులో అండర్సన్‌ బౌలింగ్‌లో రిషబ్‌ పంత్‌ కొట్టిన రివర్స్‌ స్కూప్‌ను అభిమానులు మర్చిపోలేరు.. అయితే అలాంటి షాట్‌నే మరోసారి బాదేశాడు రిషబ్‌. కానీ ఈసారి అతడి దెబ్బ చూసింది పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌. తొలి టీ20లో ఆర్చర్‌ వేసిన మెరుపు బంతిని.. వికెట్లకు కొంచెం పక్కకి జరుగుతూ రివర్స్‌ స్కూప్‌తో సిక్స్‌ బాదేశాడీ లెఫ్ట్‌ హ్యాండర్‌. బంతి వేగాన్ని ఉపయోగించుకుంటూ థర్డ్‌మ్యాన్‌ మీదుగా కొట్టిన షాట్‌కు బంతి స్టాండ్స్‌లో పడింది. ఈ షాట్‌తో అభిమానులే కాదు ఆర్చర్‌ కూడా ఆశ్చర్యపోయాడు.


‘‘ఈ పిచ్‌పై ఎలా ఆడాలో తెలుసుకోలేపోయాం. అనుకున్న షాట్లను సరిగా కొట్టలేకపోయాం. ట్రాక్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాం. పిచ్‌పై బౌన్స్‌ను ఉపయోగించుకుని ఎలా ఆడాలో శ్రేయస్‌ చూపించాడు. తప్పులు అంగీకరించి.. వాటిని దిద్దుకుని బలంగా పుంజుకోవాలి’’ - విరాట్‌ కోహ్లి


60

టీ20ల్లో చాహల్‌ వికెట్లు. భారత్‌ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు అతడిదే. బుమ్రా (59)ను అధిగమించాడు.


 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన