భిన్న సారథుల సూత్రం మనకు నప్పదు
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 16/03/2021 00:55 IST

భిన్న సారథుల సూత్రం మనకు నప్పదు

దిల్లీ: భారత జట్టుకు విరాట్‌ కోహ్లి తిరుగులేని నాయకుడని మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. టీమ్‌ఇండియా కీలక బృందంలో సీనియర్‌ ఆటగాళ్లు ఉండటం కోహ్లి అదృష్టమని తెలిపాడు. భిన్న ఫార్మాట్లలో భిన్న కెప్టెన్ల సూత్రం భారత్‌కు నప్పదని అభిప్రాయపడ్డాడు. గత 34 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి సెంచరీ చేయకపోవడంపై లక్ష్మణ్‌ మాట్లాడుతూ ‘‘కోహ్లి శతకాల గురించి నేను ఆందోళన చెందడం లేదు. విరాట్‌ ఆటతీరు, సుదీర్ఘ కాలం అతడు కొనసాగించిన నిలకడ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరి కెరీర్‌లో కొన్ని మ్యాచ్‌లు ఉంటాయి. వాటిలో తమ అత్యుత్తమ ఆటతీరు కనబరచలేకపోవచ్చు. తాము నెలకొల్పిన ప్రమాణాల్ని అందుకోలేకపోవచ్చు. కోహ్లి తనకు తానే అత్యున్నత ప్రమాణాల్ని నిర్దేశించుకున్నాడు. అందుకే   అర్ధసెంచరీలతో కూడా కోహ్లి సంతృప్తి చెందడు. కోహ్లి భారీగా పరుగులు రాబట్టలేకపోయినా అత్యధిక సిరీస్‌లలో టీమ్‌ఇండియా గెలుస్తుండటం ముఖ్యమైన విషయం. జట్టును ఎలా నడిపించాలో కోహ్లికి బాగా తెలుసు. సెంచరీకి విరాట్‌ ఎంతో దూరంలో లేడు. ఒక్కసారి శతకం సాధిస్తే మరెన్నో సెంచరీలు వరుస కడతాయి’’ అని తెలిపాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన