షెడ్యుల్‌ ప్రకారమే ఐపీఎల్‌
close

ప్రధానాంశాలు

Updated : 05/04/2021 08:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షెడ్యుల్‌ ప్రకారమే ఐపీఎల్‌

దిల్లీ: షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌ను నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతుండటం, ముంబయిలో మైదాన సిబ్బందికి కొవిడ్‌ సోకడంతో లీగ్‌ నిర్వహణపై అనుమానాలు పెరిగాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ విధించింది. అయినా లీగ్‌ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ముందు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని సౌరభ్‌ స్పష్టం చేశాడు. మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం కూడా మ్యాచ్‌లు సజావుగా సాగుతాయనే ధీమా వ్యక్తం చేస్తోంది. ‘‘ముంబయి మున్సిపల్‌ కమిషనర్‌తో చర్చించాం. లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం ఉండదని భరోసా  లభించింది’’ అని మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం తెలిపింది. కరోనా తీవ్రత కారణంగా వేదికల జాబితా నుంచి ముంబయిని తప్పిస్తే హైదరాబాద్‌లో సురక్షితంగా మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్‌ చెప్పాడు.
పడిక్కల్‌కు పాజిటివ్‌: కొవిడ్‌-19 పాజిటివ్‌గా  తేలిన ఐపీఎల్‌ ఆటగాళ్ల జాబితాలో మరొకరు చేరారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌కు ఈ మహమ్మారి సోకింది. మార్చి 22నే అతడికి కొవిడ్‌ ఉన్నట్లు తెలిసిందని ప్రస్తుతం బెంగళూరులోని తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆర్‌సీబీ తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన