close

ప్రధానాంశాలు

Published : 16/04/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజ్డెన్‌ దశాబ్దపు ఆటగాడిగా కోహ్లి

కపిల్‌, సచిన్‌లకూ గౌరవం

లండన్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ  ఖాతాలో మరో ఘనత చేరింది. విజ్డెన్‌ దశాబ్దపు (2010- 2020) వన్డే క్రికెటర్‌గా విరాట్‌ ఎంపికయ్యాడు. తొలి అంతర్జాతీయ వన్డేకు 50 ఏళ్లవుతున్న నేపథ్యంలో 1971 నుంచి 2021 మధ్య దశాబ్దానికి ఒక్కరు చొప్పున ఐదుగురు అత్యుత్తమ ఆటగాళ్లను విజ్డెన్‌ ఎంపిక చేసింది. 2010 దశాబ్దానికి అత్యుత్తమ వన్డే ఆటగాడిగా కోహ్లి ఎంపికయ్యాడు. 2010 నుంచి పదేళ్ల కాలంలో వన్డేల్లో కోహ్లి 60 పైచిలుకు సగటుతో 11,000 పరుగులు రాబట్టాడు. అందులో 42 సెంచరీలు ఉన్నాయి. క్రికెట్‌ దిగ్గజాలు కపిల్‌దేవ్‌ (1980-90), సచిన్‌ తెందుల్కర్‌ (1990- 2000)లకు కూడా ఈ గౌరవం దక్కింది. ఎనభైల్లో కపిల్‌, తొంభైల్లో సచిన్‌ ఆటపై తమదైన ముద్ర వేశారు. 1998లో సచిన్‌ ఏకంగా 9 శతకాలు సాధించాడు. టీమ్‌ఇండియాకు ప్రపంచకప్‌ అందించిన కపిల్‌దేవ్‌ 1980 దశకంలో అందరి కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బ్యాటింగ్‌లోనూ రాణించాడు. 1970ల్లో వివ్‌ రిచర్డ్స్‌ (వెస్టిండీస్‌), 2000ల్లో ముత్తయ్య మురళీధరన్‌ (శ్రీలంక) ఉత్తమ     క్రికెటర్లుగా నిలిచారు. ఇక ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ వరుసగా రెండో ఏడాది విజ్డెన్‌ ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన