close

ప్రధానాంశాలు

Published : 05/05/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హండ్రెడ్‌ లీగ్‌కు హర్మన్‌, స్మృతి, దీప్తి

దిల్లీ: ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) నిర్వహించనున్న ‘ద హండ్రెడ్‌’ (100 బంతులు) లీగ్‌లో టీమ్‌ఇండియా మహిళల టీ20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ఓపెనర్‌ స్మృతి మందాన, ఆల్‌రౌండర్‌ దీప్తిశర్మ, జెమీమా రోడ్రిగ్జ్‌ బరిలో దిగనున్నారు. జులై 21న ఇంగ్లాండ్‌లో ప్రారంభమయ్యే ఈ లీగ్‌లో పాల్గొనేందుకు నలుగురు క్రీడాకారిణులకు బీసీసీఐ నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ) మంజూరు చేసింది. ‘‘హర్మన్‌, స్మృతి, దీప్తి, జెమీమాలకు నిరభ్యంతర పత్రం అందజేసేందుకు బీసీసీఐ నుంచి ఆమోదం లభించింది’’ అని బోర్డు వర్గాలు తెలిపాయి. జూన్‌- జులైలో ఇంగ్లాండ్‌లో పర్యటన తర్వాత ‘ద హండ్రెడ్‌’ లీగ్‌ కోసం నలుగురు క్రికెటర్లు అక్కడే ఉండనున్నారు. జూన్‌ 16 నుంచి జులై 15 వరకు ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియా మహిళల జట్టు ఒక టెస్టు, 3 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌ల్లో బరిలో దిగుతుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన