టోక్యో బెర్తు పట్టేసింది
close

ప్రధానాంశాలు

Published : 08/05/2021 01:34 IST

టోక్యో బెర్తు పట్టేసింది

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సీమ

సోఫియా: భారత రెజ్లర్‌ సీమ బిస్లా ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ప్రపంచ ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ రెజ్లింగ్‌ టోర్నీ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌ చేరడంతో ఆమె టోక్యో బెర్త్‌ దక్కించుకుంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన సెమీస్‌లో 29 ఏళ్ల సీమ 2-1 తేడాతో అన్నా లుకాసియాక్‌ (పోలెండ్‌)పై నెగ్గింది. మరోవైపు నిశ (68 కేజీలు) క్వార్టర్స్‌లో నిష్క్రమించగా.. పూజ (76 కేజీలు) తొలి రౌండ్‌ దాటలేకపోయింది. పురుషుల 125 కేజీల విభాగంలో ఫైనల్‌ చేరి ఒలింపిక్స్‌లో స్థానం ఖరారు చేసుకున్న సుమిత్‌.. మోకాలి గాయం కారణంగా పసిడి పోరులో తలపడలేదు. దీంతో అతనికి రజతం దక్కింది. సీమ, సుమిత్‌తో కలిపి ఇప్పటివరకూ మొత్తం 8 మంది రెజ్లర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఒకే ఒలింపిక్స్‌లో నలుగురు భారత మహిళా రెజ్లర్లు బరిలో దిగబోతుండడం ఇదే తొలిసారి కానుంది. ఇప్పటికే వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు), అన్షు మాలిక్‌ (57 కేజీలు), సోనమ్‌ మాలిక్‌ (62 కేజీలు) టోక్యో క్రీడలకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. 2016 ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో భారత్‌ నుంచి ముగ్గురు అమ్మాయిలు పోటీపడ్డారు.

భారత రోయింగ్‌ జోడీ కూడా

దిల్లీ: అర్జున్‌ లాల్‌, అర్వింద్‌ సింగ్‌లతో కూడిన భారత రోయింగ్‌ జట్టు ఈ ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పురుషుల డబుల్‌ స్కల్స్‌ విభాగంలో ఈ జోడీ ఒలింపిక్స్‌లో పోటీ పడనున్నారు. శుక్రవారం టోక్యోలో జరిగిన ఆసియా/ఓషియానియా కాంటినెంటల్‌ క్వాలిఫయింగ్‌ రెగట్టా ఈవెంట్‌ తుది పోరులో అర్జున్‌-అర్వింద్‌ జోడీ రెండో స్థానం సాధించినప్పటికీ ఒలింపిక్స్‌ అర్హత మార్కును అందుకుంది. టాప్‌-3లో నిలిచిన జోడీలకు ఒలింపిక్‌ బెర్తులు దక్కాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
మరిన్ని

దేవతార్చన