WTC: హార్దిక్‌పై వేటు
close

ప్రధానాంశాలు

Updated : 08/05/2021 07:11 IST

WTC: హార్దిక్‌పై వేటు

కుల్‌దీప్‌పై కూడా
జడేజా, విహారి పునరాగమనం
డబ్ల్యూటీసీ ఫైనల్‌, ఇంగ్లాండ్‌తో టెస్టులకు జట్టు ఎంపిక

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, దాని తర్వాత ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ కోసం అనుకున్నట్లే భారత సెలక్టర్లు జంబో జట్టును ఎంపిక చేశారు. నలుగురు స్టాండ్‌బైలు కలిపి మొత్తం 24 మంది ఇంగ్లాండ్‌ విమానం ఎక్కబోతున్నారు. చివరగా సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు భారత జట్టులో ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌లపై సెలక్టర్లు వేటు వేశారు.

దిల్లీ: ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌ వేదికగా వచ్చే నెల 18-22 తేదీల మధ్య న్యూజిలాండ్‌తో జరగబోయే ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు.. ఆపై ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌కు 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శుక్రవారం జాతీయ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి ఫిట్‌నెస్‌ సాధించడంతో ఇంగ్లాండ్‌ పర్యటనకు అవకాశం దక్కించుకున్నారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌లపై వేటు పడింది. ఇంతకుమించి భారత జట్టు జట్టులో పెద్దగా మార్పుల్లేవు. రెగ్యులర్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌లకు తోడు.. మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ల రూపంలో ప్రత్యామ్నాయాలున్నాయి. తర్వాతి స్థానాల్లో పుజారా, కోహ్లి, రహానె ఉన్నారు. ఇషాంత్‌, బుమ్రా, షమి, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌.. ఇలా మొత్తం అరడజను మందితో ఇంగ్లాండ్‌ పర్యటన కోసం పటిష్ఠమైన పేస్‌ విభాగాన్ని సిద్ధం చేసుకుంది భారత్‌. సుదీర్ఘ పర్యటన నేపథ్యంలో బెంగాల్‌ ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌తో పాటు పేసర్లు ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, అర్జాన్‌ నాగ్వాస్‌వాలాలను సెలక్టర్లు స్టాండ్‌బైలుగా ప్రకటించారు. కోహ్లీసేన జూన్‌ 2న ఇంగ్లాండ్‌కు బయల్దేరే అవకాశాలున్నాయి. పది రోజుల క్వారంటైన్‌ అనంతరం ఆటగాళ్లు ప్రాక్టీస్‌లోకి దిగుతారు. 18-22 మధ్య కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడాక.. ఇంగ్లాండ్‌లోనే ఉండి అంతర్గత వార్మప్‌ మ్యాచ్‌లు ఆడతారు. ఆగస్టు 4న ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ ఆరంభమై.. సెప్టెంబరు 14న ముగుస్తుంది.
ఆ ఇద్దరూ ఫిట్‌నెస్‌ సాధిస్తేనే..: ఇంగ్లాండ్‌ పర్యటనకు రాహుల్‌, సాహా సైతం ఎంపికైనప్పటికీ.. వాళ్లిద్దరూ ఫిట్‌నెస్‌ సాధిస్తేనే విమానం ఎక్కుతారు. ఐపీఎల్‌ ఆడుతూ ఈ నెల 1న అపెండిసైటిస్‌కు శస్త్రచికిత్స చేయించుకున్న రాహుల్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇక సాహాకు కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే.
ఇంతమంది ఎందుకంటే..: న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం 15 మందితో జట్టును ఇంగ్లాండ్‌కు పంపాలని ఇంతకుముందు బీసీసీఐ భావించింది. తర్వాత ఇంగ్లాండ్‌తో సిరీస్‌ కోసం అదనంగా మరికొందరు ఆటగాళ్లను పంపాలనుకున్నారు. అలాగే భారత్‌-ఎ జట్టు కూడా అదే సమయంలో ఇంగ్లాండ్‌లో పర్యటించేలా ప్రణాళిక రచించారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగిశాక భారత జట్టు, ‘ఎ’ జట్టు మధ్య వార్మప్‌ మ్యాచ్‌లు కూడా ఆడించాలనుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ ప్రణాళిక మారిపోయింది. ‘ఎ’ జట్టు ఇంగ్లాండ్‌ పర్యటన రద్దయింది. అందుకే డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో సిరీస్‌ కోసం ఒకేసారి జంబో జట్టును ఎంపిక చేశారు.

వేటు అందుకే..

హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌లపై వేటు పడటంలో ఆశ్చర్యమేమీ లేదు. హార్దిక్‌ నుంచి భారత జట్టు ఆల్‌రౌండ్‌ సేవలు ఆశిస్తుండగా.. రెండేళ్ల కిందట వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి నుంచి అతను పెద్దగా బౌలింగ్‌ చేయట్లేదు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతడిపై ఒత్తిడి పడనివ్వకుండా బ్యాటింగ్‌కు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపిక చేసినా అతను బంతి పట్టుకునే అవకాశం లేనట్లే. కేవలం బ్యాట్స్‌మన్‌గా అతడిని ఎంపిక చేసే పరిస్థితి లేకపోవడంతో అతడిపై వేటు పడింది. ఇక కుల్‌దీప్‌ గత రెండేళ్లలో ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు. రెండు నెలల కిందట చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను తేలిపోయాడు. అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ వికెట్ల వేడుక చేసుకున్న రెండో టెస్టులో కుల్‌దీప్‌ కేవలం రెండు వికెట్లతోనే సరిపెట్టుకున్నాడు.

భారత జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రహానె (వైస్‌కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, రిషబ్‌ పంత్‌, విహారి, అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌, కేఎల్‌ రాహుల్‌, వృద్ధిమాన్‌ సాహా.
స్టాండ్‌బైలు: అభిమన్యు ఈశ్వరన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, అర్జాన్‌ నాగ్వాస్‌వాలా



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
మరిన్ని

దేవతార్చన