AFC Cupలో కొవిడ్‌ కలకలం
close

ప్రధానాంశాలు

Updated : 10/05/2021 07:19 IST

AFC Cupలో కొవిడ్‌ కలకలం

నిబంధనలు ఉల్లంఘించిన బెంగళూరు ఎఫ్‌సీ
దేశం విడిచి వెళ్లాలని మాల్దీవుల క్రీడల మంత్రి ఆదేశం
మాలె/దిల్లీ

ప్రపంచవ్యాప్తంగా క్రీడా ఈవెంట్లను దెబ్బ కొడుతున్న కరోనా మహమ్మారి.. ఏఎఫ్‌సీ కఫ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ మీదా ప్రభావం చూపింది. మాల్దీవులు రాజధాని మాలె వేదికగా జరుగుతున్న గ్రూప్‌-డి ప్లేఆఫ్‌ మ్యాచ్‌లను ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య అర్ధంతరంగా వాయిదా వేసింది. టోర్నీలో కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన జరగడమే అందుకు కారణం. ఈగల్స్‌ ఎఫ్‌సీతో ఐఎస్‌ఎల్‌ జట్టు బెంగళూరు ఎఫ్‌సీ ప్లేఆఫ్‌ మ్యాచ్‌కు ముందు ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరు జట్టు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో వెంటనే మాలెను విడిచి వెళ్లిపోవాలని ఆ జట్టును టోర్నీ నిర్వాహకులు ఆదేశించారు. బెంగళూరు ఆటగాళ్లు కొవిడ్‌ నిబంధనలు పట్టించుకోకుండా ఆమోద యోగ్యం కాని రీతిలో ప్రవర్తించారని, ఆ క్లబ్‌ మాల్దీవులను విడిచి వెళ్లాల్సిందే అని ఆ దేశ క్రీడల మంత్రి మహ్లూఫ్‌ స్పష్టం చేశారు. బెంగళూరు ఆటగాళ్లు కొందరు క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించి మాలె వీధుల్లో తిరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. బెంగళూరు  మేనేజ్‌మెంట్‌ కూడా నిబంధనల ఉల్లంఘన నిజమేనని చెప్పింది.
గ్రూప్‌-డిలో బెంగళూరు-ఈగల్స్‌ మ్యాచ్‌లో విజేతతో ఈ నెల 14న మరో ఐఎస్‌ఎల్‌ జట్టు ఏటీకే మోహన్‌ బగాన్‌ తలపడాల్సి ఉంది. కాగా ఆ జట్టు ప్రయాణ సన్నాహాల్లో ఉండగానే గ్రూప్‌-డి మ్యాచ్‌లన్నీ వాయిదా వేస్తున్నట్లు ఏఎఫ్‌సీ ప్రకటించింది. మ్యాచ్‌ల వాయిదాకు కారణమేంటో సమాఖ్య వెల్లడించలేదు. మాల్దీవుల్లో ఉన్న జట్లు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, ఇక్కడికి రావడానికి సన్నాహాల్లో ఉన్న వాళ్లు ప్రయాణ ఏర్పాట్లను రద్దు చేసుకోవాలని మాత్రమే ఏఎఫ్‌సీ పేర్కొంది. దీంతో ఏటీకే ఆటగాళ్లు ప్రయాణం మానుకుని కోల్‌కతాలోనే ఉండిపోయారు. అయితే ఏఎఫ్‌సీ ఈ ప్రకటన చేయడానికి కొన్ని గంటల ముందే ఏటీకే జట్టులో ఇద్దరు ఆటగాళ్లు కరోనా పాజిటివ్‌గా తేలడం గమనార్హం. మాల్దీవులకు బయల్దేరే ముందు జట్టులోని ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా.. ప్రబీర్‌ దాస్‌, సాహల్‌ పాజిటివ్‌గా తేలారు. ఈ విషయమై ఆందోళనలో ఉండగానే.. ఏఎఫ్‌సీ ప్రకటన రావడంతో సోమవారం నాటి తమ ప్రయాణాన్ని ఏటీకే రద్దు చేసుకుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 52
            [script_flag] => DEF
            [script_page] => 7
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 53
            [script_flag] => DEF
            [script_page] => 7
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

)
మరిన్ని

దేవతార్చన