అటు గన్ను.. ఇటు పెన్ను!
close
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 17/05/2021 04:39 IST

అటు గన్ను.. ఇటు పెన్ను!

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ కోసం క్రొయేషియాలో సాధనకు కదిలింది భారత షూటింగ్‌ బృందం. ఈ జట్టులో ఒక అమ్మాయి మాత్రం తన పిస్టల్‌తో పాటు పుస్తకాలను కూడా విమానం ఎక్కించింది. దీనికి కారణం త్వరలో ఆమె పరీక్షలు రాయాల్సి రావడమే. ఒకవైపు ఆటకు ప్రాధాన్యత ఇస్తూనే చదువునీ వదలని ఆ షూటరే మను బాకర్‌. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తుందన్న అంచనాలున్న మను.. ఈ నెల 18న తన బీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు మొదలుపెట్టబోతోంది. ఒసాయ్‌జెక్‌లో 20న ఆరంభమయ్యే ఐరోపా ఛాంపియన్‌షిప్‌కు ముందే ఈ పరీక్షలు ఆరంభం కానున్నాయి.  పరీక్షలు జరిగే సమయంలో తనకు పోటీలు లేకపోవడంతో రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలనేది ఆమె ఆలోచన. ప్రస్తుతం మను.. దిల్లీ యూనివర్సిటీలోని శ్రీరామ్‌ మహిళా కళాశాలలో బీఏ ఆనర్స్‌ చదువుతోంది. బాకర్‌..  ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రం ద్వారా పరీక్షలు రాసి మొబైల్‌ స్కానర్‌తో జవాబు పత్రాలను తిరిగి కళాశాలకు పంపనుంది. ‘‘ఒకవైపు షూటింగ్‌ను, మరోవైపు చదువును కొనసాగించగలను. గతంలోనూ ఇలా చేశా. నేను పరీక్షలు రాసే రోజుల్లో ఎలాంటి పోటీలు లేవు. ఒలింపిక్స్‌ ఉండడంతో ఈ ఏడాది చాలా కీలకం. దేశాన్ని గర్వించేలా ప్రదర్శన చేయడంపైనే దృష్టి సారించా’’ అని బాకర్‌ చెప్పింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
మరిన్ని

దేవతార్చన