సమయం లేకున్నా.. సమస్యేమీ లేదు
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 03/06/2021 01:38 IST

సమయం లేకున్నా.. సమస్యేమీ లేదు

ముంబయి

ఇంగ్లాండ్‌లో ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్‌తో పోరుకు ముందు తమ సన్నాహకానికి ఎక్కువ సమయం లేనప్పటికీ.. అది సమస్య కాదని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ఈ నెల 18న ఆరంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఆ తర్వాత ఇంగ్లిష్‌ జట్టుతో అయిదు టెస్టుల సిరీస్‌ కోసం బుధవారం ఇంగ్లాండ్‌కు జట్టు బయల్దేరే ముందు కోహ్లి విలేకర్లతో మాట్లాడాడు. ‘‘గతంలో మ్యాచ్‌కు మూడు రోజుల ముందు మేం ఇంగ్లాండ్‌కు చేరుకుని ప్రత్యర్థితో పోటీపడ్డ సందర్భాలున్నాయి. మేం అక్కడ ఇప్పుడే తొలిసారి ఆడట్లేదు. అక్కడి పరిస్థితుల గురించి మాకు తెలుసు. ఒకవేళ అక్కడి వాతావరణానికి అలవాటు పడినా సరైన మానసిక దృక్పథంతో మ్యాచ్‌లో అడుగుపెట్టకపోతే తొలి బంతికే ఔట్‌ కావడమో లేదా బౌలింగ్‌లో వికెట్లు దక్కకపోవడమే జరుగుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు మాకు కేవలం నాలుగు ప్రాక్టీస్‌ సెషన్లు మాత్రమే లభిస్తుండడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఓ జట్టుగా ఏం చేయగలమో మాకు తెలుసు. పైగా మా అందరికీ ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం ఉంది’’ అని కోహ్లి చెప్పాడు. ఇక్కడ 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్న కోహ్లీ సేన.. ఇంగ్లాండ్‌ చేరుకున్నాక మూడు రోజుల పాటు హోటల్‌కే పరిమితం కానుంది. ఆ తర్వాతి రోజు నుంచి ప్రాక్టీస్‌ చేసుకునే సౌలభ్యం ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన