Cricket News: ఐపీఎల్‌ అప్పటి వరకు అంటే కష్టమే...
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 09/06/2021 07:21 IST

Cricket News: ఐపీఎల్‌ అప్పటి వరకు అంటే కష్టమే...

ముంబయి

పీఎల్‌-14 రెండో దశ మ్యాచ్‌ల షెడ్యూలు తయారీలో సతమతమవుతున్న బీసీసీఐకి ఇప్పుడు చిక్కొచ్చి పడింది. డబుల్‌ హెడర్‌లను తగ్గించడం కోసం టోర్నీ జరిగే రోజులను పెంచాలని, అక్టోరు 15న ఫైనల్‌ నిర్వహించాలని బోర్డు భావిస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. కానీ అక్టోబరు 10 దాటి టోర్నీని నిర్వహణకు అనుమతించేందుకు ఐసీసీ సుముఖంగా లేదట.  ఐపీఎల్‌ మిగతా మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతాయని. సెప్టెంబరు-అక్టోబరులో మ్యాచ్‌లు ఉంటాయని బీసీసీఐ గత నెలలోనే ప్రకటించింది. అయితే టీ20 ప్రపంచకప్‌కు ఇవ్వగలుగుతామా లేదా అన్నది జూన్‌ చివరినాటికి చెబుతామని ఐసీసీ చెప్పింది. 31 ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం వీలైనన్ని ఎక్కువ రోజులు తీసుకోవాలన్నది బీసీసీఐ ఉద్దేశం. ఈ విషయమై గత కొన్ని రోజుల్లో వివిధ క్రికెట్‌ బోర్డులతో మాట్లాడింది కూడా. షెడ్యూలు ప్రకారం అక్టోబరు 10న టోర్నీ ముగియాలి. ఈ తేదీ దాటి టోర్నీ నిర్వహించే అవకాశం లేదని ఐసీసీ  వర్గాలు తెలిపాయి. ‘‘టీ20 ప్రపంచకప్‌ అక్టోబరు 18న ఆరంభమవుతుంది. అప్పుడు అక్టోబరు 15 వరకు టోర్నీని కొనసాగించడం ఎలా సాధ్యమవుతుంది. ఇందుకు ఐసీసీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. అసలు.. ప్రపంచకప్‌లో పోటీపడుతున్న దేశాలు తమ ఆటగాళ్లు అక్టోబరు 15 వరకు ఐపీఎల్‌ ఆడేందుకు ఒప్పుకుంటాయా? అక్టోబరు 10 దాటి బీసీసీఐ ఐపీఎల్‌ను నిర్వహించదు’’ అని చెప్పాయి. అక్టోబరు మధ్యలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ నవంబరు 14న ఫైనల్‌తో ముగుస్తుందని ఐసీసీ ఇప్పటికే     ప్రకటించింది. ఇక బోర్డులతో ఐసీసీ అవగాహన ప్రకారం.. ఐసీసీ ఈవెంట్‌కు కనీసం 7-10 రోజుల ముందు ఎలాంటి టోర్నీ ఉండకూడదు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన