ఆ పంచ్‌లకు ఇక సెలవ్‌..
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 02:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ పంచ్‌లకు ఇక సెలవ్‌..

బాక్సర్‌ డింకో సింగ్‌ కన్నుమూత
దిల్లీ

భారత బాక్సింగ్‌కు మార్గదర్శకుడిగా నిలిచి..  ఒలింపిక్‌ పతక విజేతలు మేరీకోమ్‌, విజేందర్‌సింగ్‌ లాంటి వారికి స్ఫూర్తిదాయకంగా మారిన డింకోసింగ్‌ ఇక లేడు. గత కొన్నేళ్లుగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ మణిపురి స్టార్‌ గురువారం కన్నుమూశాడు. 42 ఏళ్ల డింకోకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2017 నుంచి డింకో కాలేయ క్యాన్సర్‌తో ఇబ్బందిపడుతున్నాడు. రేడియోషన్‌ థెరపీ కోసం గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో అతడిని ఇంఫాల్‌ నుంచి విమానంలో దిల్లీకి తరలించాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత కరోనా రావడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. నెల రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత డింకో డిశ్ఛార్జి అయ్యాడు. కానీ ఆ తర్వాత కామెర్లు చుట్టుముట్టడంతో ఆరోగ్యం మరింత క్షీణించి అతడు తుదిశ్వాస విడిచాడు. డింకో మరణం పట్ల క్రీడా లోకం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.   ‘‘డింకోసింగ్‌ మృతి ఎంతో బాధను కలిగిస్తోంది 1998 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో అతడు సాధించిన పసిడి పతకం ఎందరో బాక్సర్లకు స్ఫూర్తినిచ్చింది’’ అని క్రీడల మంత్రి కిరెన్‌ రిజిజు అన్నాడు. ‘‘డింకో ఓ దిగ్గజం.. రాక్‌స్టార్‌! మణిపుర్‌లో అతడి బౌట్‌ చూసేందుకు  వరుసలో నిలబడేదాన్ని. డింకో నాకెంతో స్ఫూర్తినిచ్చాడు. నా వరకు అతడి మరణం తీరని లోటు’’ అని మేరీకోమ్‌ చెప్పింది. ‘‘బాక్సర్‌గా డింకో ప్రయాణం క్రీడాకారులందరికి స్ఫూర్తిదాయకం. ఈ సమయంలో అతడి కుటుంబానికి భగవంతుడు బలాన్ని ఇవ్వాలని    కోరుకుంటున్నా’’ అని విజేందర్‌ సింగ్‌ అన్నాడు.
 

ఆ ఒక్క స్వర్ణం..

డింకో సింగ్‌ పేరు చెప్పగానే గుర్తొచ్చేది 1998 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో అతడు సాధించిన పసిడి పతకమే! ఆ క్రీడల్లో బాంటమ్‌ వెయిట్‌లో బరిలో దిగి ఇద్దరు ఒలింపిక్‌ పతక విజేతలను ఓడిస్తూ డింకో గెలిచిన ఆ స్వర్ణం అప్పట్లో ఓ పెద్ద సంచలనం! ఈ స్వర్ణమే ఎంతో మంది భారత బాక్సర్లకు స్ఫూర్తినిచ్చింది.. భయమనేదే లేకుండా రింగ్‌లో కదిలే తీరు.. పదునుగా విసిరే ఎడమ చేతి పంచ్‌.. మెరుపు ఫుట్‌వర్క్‌ డింకోను అందరి కంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. అతడిని చూసే మేరీకోమ్‌, విజేందర్‌సింగ్‌, అఖిల్‌కుమార్‌ లాంటి స్టార్లు తయారయ్యారంటే భారత బాక్సింగ్‌పై అతడు వేసిన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో బాక్సింగ్‌ అభివృద్ధికి డింకోనే ప్రధాన కారణం. ఇంఫాల్‌లోని పేద కుటుంబంలో పుట్టి.. 10 ఏళ్ల వయసులో జాతీయ ఛాంపియన్‌ (సబ్‌ జూనియర్‌)గా నిలిచిన డింకో.. ఆ తర్వాత వేగంగా ఎదిగాడు. జాతీయ స్థాయిలో ఎన్ని పతకాలు గెలిచినా బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తర్వాతే డింకో సత్తా ఏంటో అందరికి తెలిసింది. అయితే మద్యానికి బానిస కావడంతో అతడి కెరీర్‌ నెమ్మదిగా గాడి తప్పింది. 2000  ఒలింపిక్స్‌, 2002 కామన్వెల్త్‌ క్రీడల్లో డింకో ఆరంభ రౌండ్లలోనే ఇంటిముఖం పట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు టోర్నీలు ఆడడం మానేసిన ఈ మణిపురి కెరటం... ఇంఫాల్‌లోని భారత క్రీడా ప్రాధికార సంస్థలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. సురంజయ్‌సింగ్‌ లాంటి ఎంతోమంది బాక్సర్లను తీర్చిదిద్దాడు. కానీ ఆరోగ్యం క్షీణించడంతో నెమ్మదిగా రింగ్‌కు దూరయ్యాడు. 1998లో అర్జున అవార్డు సొంతం   చేసుకున్న డింకో.. 2013లో పద్మశ్రీ   పురస్కారాన్ని అందుకున్నాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 52
            [script_flag] => DEF
            [script_page] => 7
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 53
            [script_flag] => DEF
            [script_page] => 7
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

)
మరిన్ని

దేవతార్చన