ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో మన్కడ్‌
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 14/06/2021 04:39 IST

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో మన్కడ్‌

దుబాయ్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నేపథ్యంలో అయిదు దేశాలకు చెందిన పది మంది దిగ్గజాలకు ఐసీసీ.. హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు కల్పించింది. తరానికి ఇద్దరికి చొప్పున అయిదు తరాల క్రికెటర్లను ఐసీసీ ఎంపిక చేసింది. ఇందులో భారత దిగ్గజం వినూ మన్కడ్‌ కూడా ఉన్నాడు. ‘‘క్రికెట్‌ చరిత్రలో ఈ పది మంది పాత్ర ఎంతో ముఖ్యమైంది. వీరి చేరికతో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఆటగాళ్ల సంఖ్య 103కు చేరింది’’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కిన వారిలో మన్కడ్‌తో పాటు ఫాల్క్‌నర్‌ (దక్షిణాఫ్రికా), మాంటీ నోబుల్‌ (ఆస్ట్రేలియా), కాన్‌స్టంటైన్‌ (వెస్టిండీస్‌), స్టాన్‌ మెక్‌కేబ్‌ (ఆస్ట్రేలియా), టెడ్‌ డెక్స్‌టర్‌ (ఇంగ్లాండ్‌), డెస్మండ్‌ హేన్స్‌ (వెస్టిండీస్‌), బాబ్‌ విలిస్‌ (ఇంగ్లాండ్‌), ఆండీ ఫ్లవర్‌ (జింబాబ్వే), కుమార సంగక్కర (శ్రీలంక) ఉన్నారు. భారత క్రికెట్లో గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరున్న మన్కడ్‌.. 44 టెస్టుల్లో 2109 పరుగులు చేశాడు. అతడు ఓపెనర్‌. మన్కడ్‌ తన ఎడమచేతి వాటం స్పిన్‌తో 162 వికెట్లు పడగొట్టాడు. మన్కడ్‌ పేరిట బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌ టోర్నీ నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన