ఆ అడుగులు చరిత్రాత్మకం!
close

ప్రధానాంశాలు

Updated : 16/06/2021 03:17 IST

ఆ అడుగులు చరిత్రాత్మకం!

ఈనాడు క్రీడావిభాగం

కొన్ని దశాబ్దాల ముందు టెస్టు క్రికెట్‌ అనగానే అందరికీ ఒకప్పుడు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ లాంటి జట్లే గుర్తొచ్చేవి. వేర్వేరు కాలాల్లో సుదీర్ఘ ఫార్మాట్లో అవి సాగించిన ఆధిపత్యం అలాంటిది.అలాంటి జట్లను దాటి భారత్‌ మేటి టెస్టు జట్టుగా ఎదుగుతుందని.. ఈ ఫార్మాట్లో నంబర్‌వన్‌ ర్యాంకు సాధిస్తుందని.. తొలిసారి నిర్వహించే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంతో ఫైనల్‌ చేరుతుందని ఎవరూ ఊహించి ఉండరేమో! సుదీర్ఘ ఫార్మాట్లో ఒక్కో అడుగే వేసుకుంటూ.. మైలురాళ్లను అధిగమిస్తూ..చివరికి శిఖరాగ్రాన నిలిచింది టీమ్‌ఇండియా.న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఇంకో రెండు రోజుల్లో ఆరంభం కానున్న నేపథ్యంలో టెస్టుల్లో టీమ్‌ఇండియా ప్రయాణాన్ని ఓసారి తరచి చూస్తే.. 


తెలుగు తేజం సారథ్యంలో..
భారత టెస్టు పయనం ఓ తెలుగు తేజం సారథ్యంలో మొదలైందని చాలామందికి తెలియకపోవచ్చు. మన దేశంలో బ్రిటీష్‌ పాలన కొనసాగుతున్న కాలంలో కఠారి కనకయ్య నాయుడు (సీకే నాయుడు) కెప్టెన్సీలో భారత జట్టు 1932లో ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడినా.. మన జట్టుకు కావాల్సినంత స్ఫూర్తినిచ్చింది. సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడడం ఎలాగో కాస్త తెలిసింది. ఈ సిరీస్‌లోనే లాలా అమర్‌నాథ్‌ భారత్‌ తరఫున తొలి సెంచరీ నమోదు చేశాడు. ఆపై 1936లోనూ టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్‌ పర్యటించింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కారణంగా భారత్‌ చాలా రోజులు క్రికెట్‌కు దూరమైంది. 1940లో మళ్లీ ఇంగ్లాండ్‌తోనే క్రికెట్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా.. ఇక అక్కడ నుంచి ఆగలేదు.
ఆ విజయం...
టెస్టుల్లో తొలి విజయం కోసం మన జట్టు దాదాపు   20 ఏళ్లు ఎదురు చూసింది. 1952లో చెన్నైలో    ఇంగ్లాండ్‌పై జరిగిన టెస్టులో గెలిచిన భారత్‌ టెస్టుల్లో బోణీ కొట్టింది. ఆ తర్వాత ఎన్నో ఘనతలు.. మరెన్నో రికార్డులు టీమ్‌ఇండియా ఖాతాలో చేరిపోయాయి. జట్టును ఉన్నత స్థితికి నడిపించే బాటలో లాలా అమర్‌నాథ్‌, గావస్కర్‌, బిషన్‌ సింగ్‌ బేడీ, చంద్రశేఖర్‌, కపిల్‌దేవ్‌, గుండప్ప విశ్వనాథ్‌, వెంగ్‌సర్కార్‌, సచిన్‌ తెందుల్కర్‌, కుంబ్లే, గంగూలీ, ద్రవిడ్‌, లక్ష్మణ్‌.. ఇలా ఎందరో దిగ్గజాలు.. మరెందరో స్టార్లు వచ్చారు.  223 (పాలి ఉమ్రిగర్‌ తొలి డబుల్‌ సెంచరీ), 413 (పంకజ్‌ రాయ్‌-వినూ మన్కడ్‌ జోడీ అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం), 281 (వీవీఎస్‌ లక్ష్మణ్‌, క్లాసిక్‌ డబుల్‌ సెంచరీ), 319 (సెహ్వాగ్‌ ట్రిపుల్‌ సెంచరీ), 10/74 (ఒకే ఇన్నింగ్స్‌లో కుంబ్లే పది వికెట్లు తీసిన ఘటన) ఇలా ఒకటేమిటి భారత టెస్టులను తలచుకుంటే ఎన్నో జ్ఞాపకాలు.. మరెన్నో తీపి గురుతులు. విదేశాలకు వెళ్లి బోల్తా కొట్టడమే కాదు విజయాలూ సాధించగలమని గంగూలీ, ధోని కెప్టెన్సీలోని జట్లు నిరూపించాయి. వీరి కంటే ముందు 1956లో  న్యూజిలాండ్‌పై 3-1తో సిరీస్‌ సాధించడం, 1971లో వారి సొంతగడ్డపై భీకరమైన  వెస్టిండీస్‌ను 1-0తో ఓడించడం విదేశాల్లో విజయాలకు పెద్ద స్ఫూర్తి.
ప్రపంచ కిరీటానికి చేరువగా..
ఇప్పుడు టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్‌ అయ్యేందుకు భారత్‌ అడుగు దూరంలో ఉంది. ఈ స్థితికి చేరేందుకు టీమ్‌ఇండియా ఎన్నో మెట్లు అధిగమించింది. 2019లో వెస్టిండీస్‌ను 2-0తో ఓడించడం ద్వారా మొదలైంది ఈ ప్రయాణం. ఆ తర్వాత అదే ఏడాది దక్షిణాఫ్రికాపై 3-0తో ఘనవిజయం.. ఆపై బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌లపై 2-0తో విజయాలు టీమ్‌ఇండియాను డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో నిలబెట్టాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే ఓడిస్తూ టెస్టు సిరీస్‌ నిలబెట్టుకోవడం మరో ఎత్తు. తొలి టెస్టులో ఓడినా, కెప్టెన్‌ కోహ్లితో సహా పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమైనా ఈ సిరీస్‌ను 2-1తో గెలిచి చరిత్ర సృష్టించిన టీమ్‌ఇండియా..ఆపై సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ను 3-1తో చిత్తు చేసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌  ఫైనల్లోకి ప్రవేశించింది.
అగ్రపీఠాన్ని పట్టి..
2009... భారత క్రికెట్‌ జట్టు చరిత్రలో చిరస్మరణీయమైన ఏడాది. ఈ సంవత్సరమే ధోని సారథ్యంలోని టీమ్‌ఇండియా తొలిసారి టెస్టుల్లో నంబర్‌వన్‌ జట్టుగా నిలిచింది. 2009 ఏప్రిల్‌లో 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత న్యూజిలాండ్‌ను ఓడించి టెస్టు సిరీస్‌ గెలిచిన భారత్‌... అదే ఏడాది డిసెంబర్‌లో శ్రీలంకను 2-0తో వైట్‌వాష్‌ చేసి నంబర్‌వన్‌ జట్టుగా అవతరించింది. ఆ తర్వాత ధోని నుంచి బ్యాటన్‌ అందుకున్న కోహ్లి జట్టును విజయపథంలో నడిపించాడు. 2016లో మరోసారి భారత్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సాధించి.. నాలుగేళ్ల పాటు దాన్ని నిలబెట్టుకుంది. నిరుడు ఆ స్థానాన్ని కోల్పోయినప్పటికీ.. ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న న్యూజిలాండ్‌కు చేరువగా రెండో స్థానంలో కొనసాగుతోంది. అదే జట్టుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ తలపడబోతుండటం విశేషం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ మళ్లీ నంబర్‌వన్‌ అయ్యే అవకాశముంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
మరిన్ని

దేవతార్చన