పక్కనపెట్టాడు.. పడిపోయింది
close

ప్రధానాంశాలు

Published : 17/06/2021 01:37 IST

పక్కనపెట్టాడు.. పడిపోయింది

రొనాల్డో దెబ్బకు రూ.29 వేల కోట్లు ఆవిరి

దిల్లీ: ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. అతను చెప్పే మాటలను వినే వాళ్లు, చేసే పనిని అనుసరించే వాళ్లూ భారీగానే ఉంటారు. ఇప్పుడీ విషయం ఎందుకూ అంటారా? రొనాల్డో చేసిన ఓ చిన్న పని, చెప్పిన ఓ మాట కారణంగా ప్రముఖ శీతల పానీయాల తయారీ సంస్థ కోకకోలాకు సుమారు రూ.29 వేల కోట్ల నష్టం వాటిల్లింది. యూరో కప్‌ 2020లో భాగంగా హంగేరీతో మ్యాచ్‌కు ముందు కోచ్‌తో కలిసి విలేకర్ల సమావేశానికి హాజరైన పోర్చుగల్‌ కెప్టెన్‌ రొనాల్డో.. అక్కడ టేబుల్‌పై ఉన్న రెండు కోకకోలా చిన్న సీసాలను తీసి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ తర్వాత నీళ్ల సీసాను చూపిస్తూ.. ‘‘మంచి నీళ్లు తాగండి’’ అని సలహా ఇచ్చాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే స్టాక్‌ మార్కెట్లో కోకకోలా షేరు విలువ 1.6 శాతం (56.10 నుంచి 55.22 డాలర్లకు) పడిపోయింది. దీని మార్కెట్‌ విలువలో నాలుగు బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.29 వేల కోట్లు) సంపద ఆవిరైంది. యూరో కప్‌ అధికారిక స్పాన్సర్లలో ఒకటైన కోకకోలా దీనిపై స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన దాన్ని తాగడానికి ఇష్టపడతారు. ప్రతి ఒక్కరికీ వేర్వేరు రుచులు,  అవసరాలు ఉంటాయి’’ అని పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
మరిన్ని

దేవతార్చన