ప్రత్యర్థిదే పైచేయి
close
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 21/06/2021 02:57 IST

ప్రత్యర్థిదే పైచేయి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌
తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 101/2
భారత్‌ 217 ఆలౌట్‌
సౌథాంప్టన్‌

టీమ్‌ఇండియా తడబడింది. రెండో రోజు పోరాటాన్ని వృథా చేసుకుంటూ.. మూడో రోజు బ్యాటుతో నిరాశపరిచింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌దే కాస్త మెరుగైన పరిస్థితి. పేసర్‌ జేమీసన్‌ విజృంభణతో కోహ్లీసేనను అనుకున్న దాని కంటే తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఆ జట్టు.. కాన్వే చక్కని బ్యాటింగ్‌తో తన తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరుపై కన్నేసింది. అయితే భారత్‌ కాస్త ఆలస్యంగానైనా రెండు వికెట్లు పడగొట్టి పోటీలోకి వచ్చింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ఆసక్తికరంగా  సాగుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 146/3తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ను జేమీసన్‌ (5/31) విజృంభణతో 217 పరుగులకే పరిమితం చేసిన కివీస్‌.. అనంతరం బ్యాట్‌తోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. ఓపెనర్‌ కాన్వే (54; 153 బంతుల్లో 6×4) రాణించడంతో ఆదివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు సాధించింది. టామ్‌ లేథమ్‌ (30; 104 బంతుల్లో 3×4) రాణించాడు. కెప్టెన్‌ విలియమ్సన్‌ (12), రాస్‌ టేలర్‌ (0) క్రీజులో ఉన్నారు. ఓ దశలో భారత్‌ బాగా వెనుకబడ్డట్లు అనిపించినా.. ఆఖర్లో రెండు వికెట్లు పడగొట్టింది. నాలుగో రోజు కివీస్‌ను బౌలర్లు ఎంతకు కట్టడి చేస్తారన్నదానిపైనే మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయితే సోమవారం ఆటకు వర్షం ముప్పు పొంచి ఉంది. వాతావరణం సరిగా లేక మూడో రోజు 74 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

రాణించిన కాన్వే: కివీస్‌ బ్యాటింగ్‌కు వచ్చేసరికి పరిస్థితులు కాస్త మారాయి. భారత పేసర్లకు న్యూజిలాండ్‌ బౌలర్లకు పిచ్‌ నుంచి లభించినంత సహకారం లభించలేదు. బ్యాటింగ్‌ మరీ అంత కష్టం కాలేదు. భారత్‌ను కట్టడి చేసిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు కాన్వే, లేథమ్‌ మంచి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ చాలా సహనంతో బ్యాటింగ్‌ చేశారు. ఎక్కువ వేగంగా స్కోరు చేయకున్నా ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. భారత ప్రధాన పేసర్‌ బుమ్రా అంతగా ప్రభావం చూపలేకపోయాడు. చక్కగా బౌలింగ్‌ చేసిన షమి.. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతులతో బ్యాట్స్‌మెన్‌ను పరీక్షించాడు. కొన్నిసార్లు బంతులు ఎడ్జ్‌ తీసుకున్నా.. దురదృష్టవశాత్తు అతడికి వికెట్‌ దక్కలేదు. అయితే పరిస్థితి ప్రతికూలంగా మారుతున్న దశలో లేథమ్‌ను ఔట్‌ చేసి భారత్‌కు అశ్విన్‌ తొలి వికెట్‌ను అందించాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతిని డ్రైవ్‌ చేయబోయిన లేథమ్‌.. కోహ్లీకి చిక్కాడు. దీంతో 70 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే మరోవైపు విలియమ్సన్‌ నిలవగా చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించిన కాన్వే అర్ధశతకం చేసుకున్నాడు. జట్టు స్కోరు 100 దాటింది. కానీ ఆఖర్లో అతణ్ని ఔట్‌ చేయడం ద్వారా భారత్‌ కాస్త సంతోషంగా రోజును ముగించేలా చేశాడు ఇషాంత్‌. మూడో రోజు కివీస్‌ ఆధిక్యాన్ని తగ్గించిన వికెట్‌ అది. ఇషాంత్‌ వేసిన ఆ ఓవరే ఆ రోజుకు చివరి ఓవర్‌ అయింది. వెలుతురులేమి కారణంగా ఆటను అక్కడితో ముగించారు.

టపటపా..

రెండో రోజు కివీస్‌ పేస్‌ను దీటుగా ఎదుర్కొన్న టీమ్‌ఇండియా మూడో రోజు మాత్రం పూర్తి భిన్నంగా ఆడింది. చకచకా వికెట్లు కోల్పోయి అనుకున్న దాని కంటే తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకుంది. భారత్‌ 68 పరుగుల తేడాలో మిగతా ఏడు వికెట్లు చేజార్చుకుంది.  కివీస్‌ పేసర్లు స్వింగ్‌, షార్ట్‌ పిచ్‌ బంతులతో బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. ముఖ్యంగా జేమీసన్‌ పదునైన పేస్‌ భారత పతనాన్ని శాసించాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 146/3.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను కోహ్లి (ఓవర్‌నైట్‌ 44), రహానె (ఓవర్‌నైట్‌ 29) కొనసాగించగా.. వికెట్ల పతనం మొదలవడానికి ఎంతో సమయం పట్టలేదు. కోహ్లి మరొక్క పరుగు జోడించకుండానే వెనుదిరిగాడు. బౌల్ట్‌, జేమీసన్‌ ఆరంభం నుంచి ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతులతో కోహ్లీని పరీక్షించారు. జేమీసన్‌ బంతి ఒకటి లోపలికి దూసుకు రావడంతో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. రహానే (49)తో నాలుగో వికెట్‌కు అతడు 61 పరుగులు జోడించాడు. రిషబ్‌ పంత్‌ (4) జట్టును ఆదుకోలేకపోయాడు. ఓ పేలవ షాట్‌ ఆడి నిష్క్రమించాడు. 20వ బంతికి కానీ ఖాతా తెరవలేకపోయిన పంత్‌.. చివరికి జేమీసన్‌ దూరంగా వేసిన బంతిని డ్రైవ్‌ చేయబోయి మూడో స్లిప్‌లో చిక్కాడు. కోహ్లి ఔటయ్యాక స్కోరు వేగాన్ని పెంచాలని భావించిన రహానె షాట్లు ఆడడం మొదలు పెట్టాడు. కానీ ఎక్కువసేపు నిలువలేకపోయాడు. అర్ధశతకానికి ముందు వాగ్నర్‌ బౌలింగ్‌లో సంశయంగా పుల్‌ షాట్‌ ఆడి మిడ్‌వికెట్లో లేథమ్‌కు చిక్కాడు. అప్పుడు స్కోరు 182/6. జడేజా (15; 53 బంతుల్లో 2×4), అశ్విన్‌ (22; 27 బంతుల్లో 3×4) పుణ్యమా అని జట్టు స్కోరు 200 దాటింది. ఓ దశలో స్కోరు 205/6. కానీ జేమీసన్‌, ఇతర పేసర్లు విజృంభించడంతో భారత్‌ 12 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. లంచ్‌ తర్వాత కొద్దిసేపటికే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) సౌథీ (బి) జేమీసన్‌ 34; శుభ్‌మన్‌ (సి) వాట్లింగ్‌ (బి) వాగ్నర్‌ 28; పుజారా ఎల్బీ (బి) బౌల్ట్‌ 8; కోహ్లి ఎల్బీ (బి) జేమీసన్‌ 44; రహానె (సి) లేథమ్‌ (బి) వాగ్నర్‌ 49; రిషబ్‌ పంత్‌ (సి) లేథమ్‌ (బి) జేమీసన్‌ 4; జడేజా (సి) వాట్లింగ్‌ (బి) బౌల్ట్‌ 15; అశ్విన్‌ (సి) లేథమ్‌ (బి) సౌథీ 22; ఇషాంత్‌ (సి) టేలర్‌ (బి) జేమీసన్‌ 4; బుమ్రా ఎల్బీ (బి) జేమీసన్‌ 0; షమి నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (92.1 ఓవర్లలో ఆలౌట్‌) 217;  

వికెట్ల పతనం: 1-62, 2-63, 3-88, 4-149, 5-156, 6-182, 7-205,  8-213, 9-213;

బౌలింగ్‌: సౌథీ 22-6-64-1; బౌల్ట్‌ 21.1-4-47-2;  జేమీసన్‌ 22-12-31-5; గ్రాండ్‌హోమ్‌ 12-6-32-0, వాగ్నర్‌ 15-5-40-2


న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లేథమ్‌ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 30; డెవాన్‌ కాన్వే  (సి) షమి (బి) ఇషాంత్‌ 54; విలియమ్సన్‌ బ్యాటింగ్‌ 12; టేలర్‌ బ్యాటింగ్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (49 ఓవర్లలో 2 వికెట్లకు) 101;

వికెట్ల పతనం: 1-70, 2-101; బౌలింగ్‌: ఇషాంత్‌ 12-4-19-1; బుమ్రా 11-3-34-0; షమి 11-4-19-0; అశ్విన్‌ 12-5-20-1; జడేజా 3-1-6-0Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
మరిన్ని

దేవతార్చన