వరుణుడి ఖాతాలో ఇంకో రోజు
close

ప్రధానాంశాలు

Updated : 22/06/2021 02:23 IST

వరుణుడి ఖాతాలో ఇంకో రోజు

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మళ్లీ వర్షం దెబ్బ

ఒక్క బంతీ పడకుండానే ఆట రద్దు

సౌథాంప్టన్‌

యిపోయింది. ఇంకో రోజు వర్షార్పణం అయిపోయింది. నాలుగు రోజుల ఆటలో కేవలం ఒకటిన్నర రోజు మాత్రమే ఆట సాగింది. ఇప్పటిదాకా ఆట జరిగిన ఓవర్లు 141.1 మాత్రమే. ఒక్క ఇన్నింగ్స్‌ మాత్రమే పూర్తయింది. మరో ఇన్నింగ్స్‌ ఆరంభ దశలోనే ఉంది. ఇంతలోనే భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో నాలుగు రోజులు గడిచిపోయాయి. రిజర్వ్‌ డే కలుపుకొన్నా ఇక మిగిలింది రెండు రోజులే. ఈ రెండు రోజుల్లో మ్యాచ్‌లో ఫలితం వస్తే అద్భుతమే అనుకోవాలి! ఇదీ ఎన్నో ఏళ్లు కసరత్తు తర్వాత శ్రీకారం చుట్టి.. రెండేళ్ల పాటు మ్యాచ్‌లను నిర్వహించి.. ఇప్పుడు చివరి ఘట్టంలో ఉన్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఇలాంటి ముగింపు ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు!

వర్షం, వెలుతురు లేమి కారణంగా.. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఒక్క రోజు కూడా ఆట పూర్తిగా సాగలేదు. వరుణుడి ప్రతాపంతో తొలి రోజు టాస్‌ కూడా పడలేదు. రెండో రోజు కూడా రెండు సెషన్ల ఆటే సాగింది. వెలుతురు లేమితో ముందే ఆటను ఆపేశారు. వర్షం వల్ల మూడో రోజు ఆటలోనూ కొన్ని ఓవర్లు తగ్గాయి. నాలుగో రోజు వర్ష సూచనతో ఆట జరిగే అవకాశాలు లేవని ముందే సంకేతాలు వచ్చాయి. అనుకున్నట్లే ఒక్క బంతి కూడా పడకుండానే సోమవారం ఆటను రద్దు చేయాల్సి వచ్చింది. భారత్‌ను 217 పరుగులకు కట్టడి చేసిన న్యూజిలాండ్‌.. మూడో రోజు ఆట ఆఖరుకు 101/2తో నిలిచిన సంగతి తెలిసిందే. కేన్‌ విలియమ్సన్‌ (12), రాస్‌ టేలర్‌ (0) క్రీజులో ఉన్నారు.ఎంతో ఆసక్తి  రేకెత్తించిన డబ్ల్యూటీసీ ఫైనల్‌ వర్షం దెబ్బకు ఇలా నిస్సారంగా మారిపోవడం క్రికెట్‌ అభిమానులకు తీవ్ర అసహనానికి గురి చేసే విషయమే. ఈ సమయంలో బాగా వర్షాలు పడే సౌథాంప్టన్‌ను ఇంతటి ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు వేదికగా ఎంపిక చేయడమేంటన్న ప్రశ్నలు ఐసీసీకి సంధిస్తున్నారు అభిమానులు. అసలు ఇంగ్లాండ్‌లో ఈ మ్యాచ్‌ నిర్వహణనే తప్పుబడుతున్నారు. ఇంగ్లాండ్‌లో మ్యాచ్‌ అంటే రిజర్వ్‌డే ఒకటి సరిపోదని రెండుండాలని కొందరంటున్నారు. ఇక చాలామంది మాజీ క్రికెటర్లేమో డబ్ల్యూటీసీ విజేతను  తేల్చడానికి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నిర్వహించాల్సిందని, ఒక మ్యాచ్‌కు పరిమితం కావాల్సింది కాదని అంటున్నారు.  

ఇప్పటికే టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి, మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఈ అభిప్రాయం వ్యక్తం చేయగా.. తాజాగా ఇంగ్లాండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ సైతం ఇదే మాట అన్నాడు. ‘‘ఇదెంతో బాధ కలిగించే విషయమే. ఇంత ముఖ్యమైన పోరును ఇంగ్లాండ్‌లో నిర్వహించాలనుకున్నపుడు ఒక్క మ్యాచ్‌కు పరిమితం చేయాలనుకోవడం తప్పు. ఒక్క మ్యాచ్‌తో విజేతను నిర్ణయించాలనుకుంటే దుబాయ్‌లో నిర్వహించాల్సింది. అక్కడ వర్షం ఉండదు. పైగా అది తటస్థ వేదిక కూడా’’ అని పీటర్సన్‌ అన్నాడు. ఈ సమయంలో ఇంగ్లాండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ నిర్వహించాలనుకోవడం ఐసీసీ పొరపాటని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ‘‘బ్యాట్స్‌మెన్‌కే కాదు. ఐసీసీకి కూడా టైమింగ్‌ ఉండాలి. భారత బ్యాట్స్‌మెన్‌ లాగే టైమింగ్‌లో ఐసీసీ కూడా తప్పు చేసింది’’ అతను వ్యంగ్యాస్త్రం విసిరాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
మరిన్ని

దేవతార్చన