టెస్టు గెలిస్తే 12 పాయింట్లు
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 01/07/2021 02:25 IST

టెస్టు గెలిస్తే 12 పాయింట్లు

దిల్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) కొత్తగా షురూకానుంది. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య అయిదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌తో డబ్ల్యూటీసీ-2కు తెరలేవనుంది. 2021-23 మధ్య జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌ కాస్త భిన్నంగా మొదలవుతోంది. తొలి డబ్ల్యూటీసీలో మాదిరిగా సిరీస్‌లో మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా కాకుండా ప్రతి మ్యాచ్‌కు ఒకే రీతిలో పాయింట్లు కేటాయించనున్నారు. ఇంతకుముందు సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయించేవారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ అయితే గెలిచిన జట్టుకు మ్యాచ్‌కు 60 పాయింట్లు, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ అయితే మ్యాచ్‌కు 40 పాయింట్లు ఇచ్చేవారు. దీనిపై చాలా విమర్శలే వచ్చాయి. చివరికి కరోనా కారణంగా అత్యధిక పాయింట్లు సాధించిన రెండు జట్లు మధ్య కాకుండా గెలుపు శాతం ఆధారంగా ఫైనలిస్టును నిర్ణయించారు.

ఆరు సిరీస్‌లు: కొత్త విధాంలో ఒక్కో  సిరీస్‌కు 120 పాయింట్లు కాకుండా సిరీస్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఉన్నా.. ప్రతి మ్యాచ్‌కు సమాన పాయింట్లుంటాయి. మ్యాచ్‌ గెలిస్తే 12 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లు, డ్రా అయితే నాలుగు పాయింట్లు లభిస్తాయి. గెలచిన పాయింట్ల శాతం ఆధారంగా జట్లకు ర్యాంకింగ్‌ కేటాయిస్తారు. లీగ్‌ దశలో   అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య ఫైనల్‌ నిర్వహిస్తారు. ఈ కొత్త పాయింట్ల విధానానికి ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం లభించాల్సి ఉంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన