ఎక్కేయ్‌.. పతకాన్ని పట్టేయ్‌
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 07/07/2021 01:56 IST

ఎక్కేయ్‌.. పతకాన్ని పట్టేయ్‌

టోక్యో ఒలింపిక్స్‌ ఇంకో 16 రోజుల్లో

క్లైంబింగ్‌ అంటే.. సరదాగా స్నేహితులతో కలిసి వెళ్లి కొండలు, గుట్టల్లాంటివి ఎక్కడం. సెలవుల్లో లేదా వారాంతాల్లో కాలక్షేపం కోసం ఇలా చేస్తుంటారు. కానీ టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత క్లైంబింగ్‌ కథ మారిపోవడం ఖాయం. సరదా పక్కనపెట్టి దీన్ని కెరీర్‌గా మార్చుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించొచ్చు. ఎందుకంటే క్లైంబింగ్‌ ఇప్పుడు ఒలింపిక్‌ క్రీడ. టోక్యోలోనే అరంగేట్రం చేయబోతోంది.

ఈనాడు క్రీడావిభాగం

తొలిసారి విశ్వ క్రీడల్లో అడుగు పెడుతున్న క్లైంబింగ్‌లో.. లీడ్‌, బౌల్డరింగ్‌, స్పీడ్‌ అని మూడు విభాగాల్లో పోటీలుంటాయి. ఈ మూడింట్లో కలిపి ఉత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్లకు పతకాలు దక్కుతాయి. పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తారు. లీడ్‌ అంటే సాధారణంగా బయట కొండలు ఎక్కినట్లే ఉంటుంది. దాదాపు 15 మీటర్లు ఉన్న గోడను ఎక్కేందుకు క్లైంబర్లకు 6 నిమిషాల సమయం ఉంటుంది. పట్టుకోవడానికి వీలుగా ఉండే హోల్డ్స్‌ సాయంతో ఈ వ్యవధిలో ఎవరు ఎక్కువ ఎత్తుకు వెళ్లగలిగితే వాళ్లు విజేతలు. బౌల్డరింగ్‌లో భాగంగా క్లైంబర్లకు విభిన్న సవాళ్లు ఎదురవుతాయి. 4.5 మీటర్ల గోడపై వంపులు తిరిగి, చీలికలు ఉండేలా, వేళ్లతో మాత్రమే పట్టుకునేలా, మరో వైపుగా ఎగిరేలా ఇలా విభిన్న రకాలుగా క్లైంబర్ల సామర్థ్యాన్ని పరీక్షించస్తారు. ఒక్కో లక్ష్యాన్ని అధిగమించేందుకు క్లైంబర్లకు నాలుగు నిమిషాల సమయమిస్తారు. ఈ వ్యవధిలో క్లైంబర్లు ఎన్నిసార్లైనా ప్రయత్నించవచ్చు. పూర్తి నియంత్రణతో పైౖకెక్కే వాళ్లు గెలుస్తారు. స్పీడ్‌ విభాగం పరుగు పందెం లాగే ఉంటుంది. 15 మీటర్ల గోడను హోల్డ్స్‌ సాయంతో ముందుగా ఎవరు ఎక్కితే వాళ్లే విజేతలు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఈ స్పీడ్‌ విభాగానికి ప్రత్యేకంగా పతకం కేటాయించనున్నారు.

విజేత ఎలా?: మూడు విభాగాల్లో ప్రదర్శనను కలిపి అంతిమ విజేతలను ప్రకటిస్తారు. తక్కువ స్కోరు వచ్చిన వాళ్లు గెలిచినట్లు. ఉదాహరణకు.. ఓ క్లైంబర్‌ లీడ్‌లో అగ్రస్థానంలో నిలిచి, బౌల్డరింగ్‌లో రెండు, స్పీడ్‌లో పదో స్థానాన్ని దక్కించుకున్నాడనుకుందాం. అప్పుడు అతని మొత్తం స్కోరు 20 (1×2×10) అవుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఉత్తమ క్లైంబర్‌గా పేరున్న 28 ఏళ్ల ఆడమ్‌ ఓండ్రా (చెక్‌ రిపబ్లిక్‌) పురుషుల్లో పసిడి గెలుచుకునేలా కనిపిస్తున్నాడు. మహిళల్లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియనైన 22 ఏళ్ల జాంజా గార్న్‌బ్రెట్‌ (స్లోవేనియా) ఫేవరేట్‌గా అడుగుపెడుతోంది. ఆతిథ్య జపాన్‌తో పాటు యుఎస్‌, ఫ్రాన్స్‌ మాత్రమే నలుగురు క్లైంబర్లతో కూడిన పూర్తి జట్లను బరిలో దింపే అర్హత సాధించాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన