ఒక్క భారత్‌లోనే అలా..
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 08/07/2021 09:50 IST

ఒక్క భారత్‌లోనే అలా..

దిల్లీ: ఒక్క భారతదేశంలోనే వ్యాఖ్యానాన్ని రిటైర్మెంట్‌ తర్వాత చేసే పనిగా భావిస్తారని క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. అలాంటి మూస ధోరణిని మార్చాలని అనుకుంటున్నానని అతడు చెప్పాడు. భారత్‌, న్యూజిలాండ్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సందర్భంగా వ్యాఖ్యాతగా అరంగేట్రం చేసిన కార్తీక్‌.. తన మాటతీరుతో అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో అతడిపై ప్రశంసల జల్లు కురిసింది. ఆ తర్వాత శ్రీలంక, ఇంగ్లాండ్‌ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లో కూడా అతడు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ‘‘వ్యాఖ్యాతగా క్రికెట్‌ గురించి నాకు తెలిసింది మాట్లాడాలనుకున్నా. బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌ వంటి ఇతర క్రీడల్లో ఆటగాళ్లు తాము ఆటకు దూరంగా ఉన్నప్పుడు వాఖ్యానం చేయడం మామూలే. శ్రీలంక, ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌లో జేమ్స్‌ అండర్సన్‌ కూడా బీబీసీ కోసం వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ప్రస్తుత ఆటగాళ్లు వ్యాఖ్యానం చేయడం ప్రపంచ వ్యాప్తంగా సాధారణమే. ఒక్క భారత్‌లోనే అది రిటైర్మెంట్‌ అనంతరం చేసే పనిగా పరిగణిస్తారు. అలాంటి మూస ధోరణిని మార్చాలని అనుకుంటున్నా. నేను జట్టులో లేనప్పుడు సంతోషంగా కామెంట్రీ చెబుతా’’ అని కార్తీక్‌ చెప్పాడు. వ్యాఖ్యానానికి సంబంధించి సునీల్‌ గావస్కర్‌ తనకు కొన్ని చిట్కాలు చెప్పాడని తెలిపాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య అయిదు టెస్టుల సిరీస్‌లో కూడా కార్తీక్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో ఆడడం కోసం యూఏఈ వెళ్తాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన