ఎన్నాళ్లో వేచిన కప్పు
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 12/07/2021 02:29 IST

ఎన్నాళ్లో వేచిన కప్పు

నిజమైన మెస్సి కల

అర్జెంటీనాకు కోపా టైటిల్‌

ఫైనల్లో బ్రెజిల్‌పై విజయం

రియోడిజెనీరో

28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు అర్జెంటీనా ముగింపు పలికింది.. తనదైన ఆటతీరుతో కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీలో విజేతగా నిలిచింది. ఎన్నో అంచనాల మధ్య మైదానంలో అడుగుపెట్టిన ఆ జట్టు.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బ్రెజిల్‌ను దాని సొంతగడ్డపైనే ఓడించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ప్రపంచ ఆల్‌టైమ్‌ అగ్రశ్రేణి ఆటగాడు లియొనల్‌ మెస్సీకి జాతీయ జట్టు తరపున ఇదే తొలి ప్రధాన టైటిల్‌.

ప్రఖ్యాత మారకానా స్టేడియం అర్జెంటీనా జాతీయ పతాకాలతో ఊగిపోయింది. కోపా అమెరికా 2021 ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆ జట్టు విజేతగా నిలవడంతో ఆ దేశ అభిమానుల కేరింతలతో మోగిపోయింది.  ఆదివారం ఫైనల్లో అర్జెంటీనా 1-0 తేడాతో బ్రెజిల్‌ను ఓడించింది. డి మారియా జీవితాంతం గుర్తుండిపోయే గోల్‌తో జట్టును గెలిపించాడు. సెమీస్‌లో కొలంబియాపై గెలిచిన అర్జెంటీనా జట్టులో అయిదు మార్పులతో ఆ జట్టు కోచ్‌ స్కాలోని తొలి పదకొండు మందిని మైదానంలోకి పంపి ఆశ్చర్యపరిచాడు. మరోవైపు బ్రెజిల్‌ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగింది. ఆరంభం నుంచే జాగ్రత్తగా ఆడిన రెండు జట్లూ.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే పట్టుదల ప్రదర్శించాయి. అయితే 22వ నిమిషంలో మైదానం మధ్యలో నుంచి రోడ్రిగో అందించిన బంతిని ప్రత్యర్థి గోల్‌పోస్టు వైపుగా తన్నుకుంటూ వచ్చిన మారియా.. గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి అతని తల మీదుగా దాన్ని గోల్‌పోస్టులోకి పంపాడు. అంతే ఆ జట్టు   ఆటగాళ్లతో పాటు అభిమానులూ ఆనందంలో మునిగిపోయారు. అక్కడి నుంచి మ్యాచ్‌ మరో స్థాయికి చేరింది. కానీ నెయ్‌మార్‌కు బంతి దొరక్కుండా కట్టడి చేయడంలో అర్జెంటీనా విజయవంతమైంది. రెండో అర్ధభాగంలో స్కోరు సమం చేసేందుకు బ్రెజిల్‌ శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. కానీ అర్జెంటీనా డిఫెన్స్‌తో పాటు గోల్‌కీపర్‌ మార్టినెజ్‌ ప్రత్యర్థి ఆటగాళ్ల ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకున్నాడు.


విరిసిన స్నేహబంధం..

మంచి మిత్రులైన మెస్సి, నెయ్‌మార్‌ మధ్య ఉన్న స్నేహ బంధం మరోసారి ఆకట్టుకుంది. ఓ వైపు సహచర ఆటగాళ్లు విజయ సంబరాలు చేసుకుంటుండగా మరోవైపు ఓటమి బాధలో ఉన్న బ్రెజిల్‌ కెప్టెన్‌ నెయ్‌మార్‌ను హత్తుకుని మెస్సి ఓదార్చాడు. ఈ టోర్నీలో ఈ ఇద్దరు ఆటగాళ్లూ.. అత్యుత్తమ క్రీడాకారులుగా నిలిచి ‘‘బంగారు బంతి’’ని అందుకున్నారు.


1

అర్జెంటీనా తరపున మెస్సీకిదే తొలి ప్రధాన టైటిల్‌.


15

కోపా అమెరికాలో అర్జెంటీనాకిది 15వ టైటిల్‌. అత్యధిక టైటిళ్ల రికార్డులో ఆ జట్టు.. ఉరుగ్వేతో సమానంగా అగ్రస్థానంలో నిలిచింది.


రూ.48 కోట్లు టైటిల్‌ నెగ్గిన అర్జెంటీనా సొంతం చేసుకున్న ప్రైజ్‌మనీ.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన