మెరిసిన సూర్య
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 26/07/2021 03:26 IST

మెరిసిన సూర్య

 రాణించిన బౌలర్లు

తొలి టీ20లో శ్రీలంకపై భారత్‌ విజయం

కొలంబో: టీ20 సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (50; 34 బంతుల్లో 5×4, 2×6) మెరవడంతో తొలి టీ20లో ఆదివారం 38 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. సూర్యతో పాటు కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (46; 36 బంతుల్లో 4×4, 1×6) రాణించడంతో మొదట భారత్‌ 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. చమీర (2/24), హసరంగ (2/28) భారత్‌ను కట్టడి చేశారు. అసలంక (44; 26 బంతుల్లో 3×4, 3×6) ధాటిగా ఆడినా, ఛేదనలో శ్రీలంక 18.3 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. ఓ దశలో లంకను 50/3తో ఇబ్బందుల్లోకి నెట్టినా భారత్‌కు విజయం అంత తేలిగ్గా ఏమీ దక్కలేదు. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిన అసలంక.. కలవర పెట్టాడు. అతడి జోరుతో లంక 15.2 ఓవర్లలో 111/4తో గెలుపుపై కన్నేసింది. కానీ 16వ ఓవర్లో అసలంకను దీపక్‌ చాహర్‌ ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. ఆ తర్వాత లంకపై ఒత్తిడి పెరిగింది. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన బౌలర్లు.. టెయిలెండర్లను చకచకా వెనక్కి పంపి భారత్‌కు విజయాన్నందించారు. శ్రీలంక 15 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు చేజార్చుకుంది. భువనేశ్వర్‌ (4/22), దీపక్‌ చాహర్‌ (2/24), వరుణ్‌ చక్రవర్తి (1/28), చాహల్‌ (1/19) ఆతిథ్య జట్టును దెబ్బతీశారు.

సూర్య ధనాధన్‌: భారత్‌ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్‌ బ్యాటింగే హైలైట్‌. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. తొలి బంతికే ఓపెనర్‌ పృథ్వీ షా (0) వికెట్‌ను కోల్పోయింది. ధావన్‌ నిలవగా.. శాంసన్‌ (27; 20 బంతుల్లో 2×4, 1×6) ధాటిగా ఆడడంతో భారత్‌ 6 ఓవర్లలో 51/1తో నిలిచింది. కానీ తర్వాతి ఓవర్లోనే హసరంగకు సంజు వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే సూపర్‌ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడితో మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించిన ధావన్‌ 15వ ఓవర్లో ఔటయ్యాడు. సూర్య తర్వాతి ఓవర్లోనే నిష్క్రమించినా.. తన ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో పెద్ద స్కోరుకు మంచి బాటే వేశాడు. కానీ హర్దిక్‌ (10), కిషన్‌ (20 నాటౌట్‌) ధాటిగా ఆడలేకపోయారు. చివరి 4 ఓవర్లలో 34 పరుగులే వచ్చాయి. ఈ మ్యాచ్‌తో పృథ్వీ షా, వరుణ్‌ టీ20 అరంగేట్రం చేశారు.

భారత్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) మినోద్‌ (బి) చమీర 0; ధావన్‌ (సి) బండార (బి) కరుణరత్నె 46; సంజు శాంసన్‌ ఎల్బీ (బి) హసరంగ 27; సూర్యకుమార్‌ (సి) మెండిస్‌ (బి) హసరంగ 50; హార్దిక్‌ (సి) మినోద్‌ (బి) చమీర 10; ఇషాన్‌ కిషన్‌ నాటౌట్‌ 20; కృనాల్‌ పాండ్య నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 164; వికెట్ల పతనం: 1-0, 2-51, 3-113, 4-127, 5-153; బౌలింగ్‌: చమీర 4-0-24-2; చమిక కరుణరత్నె 4-0-34-1; అకిల ధనంజయ 3-0-40-0; ఉదాన 4-0-32-0; వనిందు హసరంగ 4-0-28-2; దసున శనక 1-0-4-0

శ్రీలంక ఇన్నింగ్స్‌: అవిష్క (సి) శాంసన్‌ (బి) భువనేశ్వర్‌ 26; మినోద్‌ (సి) సూర్యకుమార్‌ (బి) కృనాల్‌ 10; ధనంజయ (బి) చాహల్‌ 9; అసలంక (సి) పృథ్వీ (బి) దీపక్‌ చాహర్‌ 44; అషెన్‌ బండార (బి) హార్దిక్‌ 9; శనక (స్టంప్డ్‌) కిషన్‌ (బి) వరుణ్‌ 16; హసరంగ (బి) దీపక్‌ చాహర్‌ 0; చమిక కరుణరత్నె (బి) భువనేశ్వర్‌ 3; ఉదాన (సి) సూర్యకుమార్‌ (బి) భువనేశ్వర్‌ 1; చమీర (సి) కృనాల్‌ (బి) భువనేశ్వర్‌ 1; అకిల ధనంజయ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (18.3 ఓవర్లలో ఆలౌట్‌) 126
వికెట్ల పతనం: 1-23, 2-48, 3-50, 4-90, 5-111, 6-111, 7-122, 8-124, 9-125

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3.3-0-22-4; దీపక్‌ చాహర్‌ 3-0-24-2; కృనాల్‌ 2-0-16-1; వరుణ్‌ చక్రవర్తి 4-0-28-1; చాహల్‌ 4-0-19-1; హార్దిక్‌ 2-0-17-1Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన