కుర్రాళ్లు కష్టపడ్డా..
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 29/07/2021 03:02 IST

కుర్రాళ్లు కష్టపడ్డా..

భారత్‌తో రెండో టీ20 శ్రీలంకదే

చివరి టీ20 నేడు

రాత్రి 8 నుంచి

కొలంబో: చాలా మంది ఆటగాళ్లు దూరం కావడంతో బలహీనపడ్డ భారత్‌.. ఆసక్తికరంగా సాగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. మొదట భారత్‌ 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. ధావన్‌ (40; 42 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌. ధనంజయ డిసిల్వా (40 నాటౌట్‌; 34 బంతుల్లో 1×4, 1×6), మినోద్‌ (36; 31 బంతుల్లో 4×4) రాణించడంతో లక్ష్యాన్ని శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో శ్రీలంక 17.2 ఓవర్లలో 105/6తో నిలిచింది. పరుగులు చేయడం కష్టంగా ఉండడంతో భారత్‌.. గెలిచేలా కనిపించింది. కానీ ఒత్తిడిలో చక్కగా బ్యాటింగ్‌ చేసిన డిసిల్వా, కరుణరత్నె (12 నాటౌట్‌) లంకను విజయపథంలో నడిపించారు. కరోనా కారణంగా కృనాల్‌ పాండ్య దూరం కావడం, అతడికి సన్నిహితంగా ఉన్న మరికొందరిని కూడా దూరం పెట్టడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ చాలా మార్పులతో బరిలోకి దిగింది. దేవ్‌దత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సకారియా, నితీష్‌ రాణా టీ20 అరంగేట్రం చేశారు. సిరీస్‌ 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మూడో టీ20 గురువారమే జరుగుతుంది.

రాణించిన ధావన్‌: మందకొడి పిచ్‌పై అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు పరుగులు రాబట్టడం కష్టమైపోయింది. బంతి.. బ్యాట్‌పైకి సరిగా రాలేదు. బ్యాట్స్‌మెన్‌ 42 డాట్‌ బాల్స్‌ ఆడారు. వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్‌ కూడా స్లోగా మారింది. భారత్‌ ఇన్నింగ్స్‌లో మొత్తంగా ఏడు ఫోర్లు, ఓ సిక్స్‌ మాత్రమే నమోదయ్యాయి. జాగ్రత్తగా ఆడిన కెప్టెన్‌ ధావన్‌.. రుతురాజ్‌ (21; 18 బంతుల్లో 1×4) తొలి వికెట్‌కు 49, పడిక్కల్‌ (29; 23 బంతుల్లో 1×4, 1×6)తో రెండో వికెట్‌కు 32 పరుగులు జోడించి 13 ఓవర్లో ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 81. కొన్ని చక్కని షాట్లు ఆడిన పడిక్కల్‌.. 16వ ఓవర్లో నిష్క్రమించాడు. తర్వాతెవరూ రాణించలేకపోయారు. సంజు శాంసన్‌ (7) మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. నితీష్‌ రాణా (9) కూడా బ్యాట్‌ ఝుళిపించలేకపోయాడు. భారత్‌కు చివరి ఏడు ఓవర్లలో 47 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్‌ ఆరుగురు బౌలర్లతో ఈ మ్యాచ్‌ ఆడింది. 19వ ఓవర్లో ఫీల్డింగ్‌ చేస్తూ సైని గాయపడ్డాడు.

సంక్షిప్త స్కోర్లు; భారత్‌ ఇన్నింగ్స్‌: 132/5 (రుతురాజ్‌ 21, ధావన్‌ 40, పడిక్కల్‌ 29, సంజు శాంసన్‌ 7, నితీష్‌ రాణా 9; అకిల ధనంజయ 2/29); శ్రీలంక ఇన్నింగ్స్‌: 133/6 (ధనంజయ 40 నాటౌట్‌, మినోద్‌ 36; కుల్‌దీప్‌ 2/30, వరుణ్‌ చక్రవర్తి 1/18, భువనేశ్వర్‌ 1/21, రాహుల్‌ చాహర్‌ 1/27, సకారియా 1/34)Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన