పడి లేచి గెలిచింది
Array ( [0] => stdClass Object ( [video_type] => 1 [video_short_link] => PUZBN500F7E ) ) 1

ప్రధానాంశాలు

Updated : 03/08/2021 11:31 IST

పడి లేచి గెలిచింది

టోక్యో: సాధారణంగా సినిమాల్లో చూసే దృశ్యమిది.. ఒక పరుగు పందెం జరుగుతూ ఉంటుంది.. హీరో ఏదో కారణాలతో పడిపోయి వెనకబడిపోతాడు. కానీ సీన్‌ కట్‌ చేస్తే అతడు లేచి పుంజుకుని అందర్ని దాటుకుంటూ వెళ్లి విజేతగా నిలుస్తాడు. సినిమాల్లో ఇది బాగానే ఉంటుంది కానీ నిజ జీవితంలో కష్టం. అయితే ఒలింపిక్స్‌లో అలాంటి సీన్‌ జరిగింది. నెదర్లాండ్స్‌ అమ్మాయి సిఫాన్‌ హసన్‌ ఈ అద్భుతాన్ని చేసింది. 1500 మీటర్ల పరుగు హీట్స్‌లో మొదట తడబడి పడిపోయిన సిఫాన్‌.. మళ్లీ లేచి పరుగు ప్రారంభించింది. ఒక్కొక్కరిని దాటుకుంటూ ఫినిషింగ్‌ లైన్‌ను అందుకుంది. ఆమె 4 నిమిషాల 05.17 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. సిఫాన్‌ ఇలా పుంజుకుని గెలిచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అవుతోంది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 1500 మీటర్లు, 10,000 మీటర్లలో పసిడి పతకాలు గెలిచిన ఇఫాన్‌.. టోక్యోలో ఈ రెండు పతకాలకు తోడు 5000 మీటర్ల స్వర్ణం సాధించాలన్నది ఆమె లక్ష్యం. ఇథియోపియాలో పుట్టిన ఇఫాన్‌.. 15 ఏళ్ల వయసులో శరణార్థిగా నెదర్లాండ్స్‌కు వచ్చి స్థిరపడింది. ఒకవైపు నర్సుగా పని చేస్తూనే అథ్లెటిక్స్‌లోనూ సత్తా చాటుతోంది. ఒక మైలులో ప్రపంచ రికార్డు (4 నిమిషాల 12.33 సెకన్లు) ఆమె పేరిటే ఉంది.

5000 మీటర్లలో పసిడి: టోక్యో ఒలింపిక్స్‌లో ట్రిపుల్‌పై గురి పెట్టిన సిఫాన్‌ తొలి అడుగు వేసింది. మహిళల 5000 మీటర్ల పరుగులో ఆమె పసిడి పట్టేసింది. తుదిపోరులో 14 నిమిషాల 36.79 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన సిఫాన్‌.. అగ్రస్థానంలో నిలిచింది. ఈ రేసులో ఓబ్రి (కెన్యా, 14 నిమిషాల 38.36 సెకన్లు), గడాఫ్‌ (ఇథియోపియా, 14 నిమిషాల 38.87 సెకన్లు) రజత, కాంస్య పతకాలు సాధించారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన