తుది జట్టులో ఎవరో?
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 03/08/2021 05:49 IST

తుది జట్టులో ఎవరో?

 రేపట్నుంచే భారత్‌-ఇంగ్లాండ్‌ తొలి టెస్టు

ప్రాక్టీస్‌లో మయాంక్‌ తలకు గాయం

నాటింగ్‌హామ్‌: న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో కంగుతిన్న భారత్‌.. 40 రోజులకు పైగా విరామం తర్వాత మళ్లీ కీలక టెస్టు పోరుకు సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ బుధవారమే ఆరంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌కు తుది జట్టు ఎంపికలో భారత్‌కు తలనొప్పి తప్పేలా లేదు. శుభ్‌మన్‌ గిల్‌ గాయపడి స్వదేశానికి వెళ్లిపోవడంతో రోహిత్‌కు తోడుగా మయాంక్‌ అగర్వాల్‌ను దించాలనుకున్న భారత్‌కు షాక్‌ తగిలింది. సోమవారం ప్రాక్టీస్‌ సందర్భంగా పేసర్‌ సిరాజ్‌ విసిరిన బంతి మయాంక్‌ తలకు బలంగా తాకి గాయపడ్డాడు. అతను కంకషన్‌కు గురి కావడంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. మయాంక్‌ స్థానంలో కొత్త ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడిస్తారా లేక కేఎల్‌ రాహుల్‌ను ఎంచుకుంటారా అన్నది చూడాలి. ఆరో స్థానంలో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా విహారిని ఆడించడం సందేహమే. అతడిని పక్కన పెట్టి స్పిన్‌ ఆల్‌రౌండర్లయిన జడేజాలిద్దరినీ తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. పంత్‌ ఆరో స్థానంలో ఆడితే.. జడేజా, అశ్విన్‌ తర్వాతి స్థానాల్లో వస్తారు. పేస్‌ భారాన్ని ఇషాంత్‌, షమి, బుమ్రాలే పంచుకునే అవకాశముంది. సిరాజ్‌ను ఆడించడం అనుమానమే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన