సంతోషం సగమే..
Array ( [0] => stdClass Object ( [video_type] => 1 [video_short_link] => 5rlDfK9l-8Y ) ) 1

ప్రధానాంశాలు

Updated : 14/08/2021 09:40 IST

సంతోషం సగమే..

భారీ స్కోరు ఆశలకు కళ్లెం

భారత్‌ 364 పరుగులకే పరిమితం

ఇంగ్లాండ్‌ 119/3

రెండో టెస్టు

ఒక ఓపెనర్‌ 129 పరుగులు చేశాడు. ఇంకో ఓపెనర్‌ 83 పరుగులు సాధించాడు. టెస్టు మ్యాచ్‌లో ఆరంభ వీరులు ఇంత మంచి ఓపెనింగ్‌ ఇచ్చాక.. తర్వాత వారిని మించిన బ్యాట్స్‌మెన్‌ ఉన్నపుడు.. అలవోకగా 500 కొట్టేయాలి. కానీ ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమ్‌ఇండియా మాత్రం 364 పరుగులకు పరిమితమైంది. టెస్టుల్లో భారత బ్యాటింగ్‌ మూల స్తంభాలైన ముగ్గురూ ఫామ్‌ కోసం తంటాలు పడుతుండటంతో ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో గట్టి దెబ్బ తీసే అవకాశం చేజారింది. ఇక ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించడం బౌలర్ల చేతుల్లోనే ఉంది. రెండో రోజు ఆట ఆఖరుకు ఇంగ్లాండ్‌ స్కోరు 119/3.

లార్డ్స్‌

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు తొలి రోజు ఆధిపత్యం చలాయించిన భారత్‌.. రెండో రోజు కొంచెం పట్టు కోల్పోయింది. 276/3తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమ్‌ఇండియా.. 364 పరుగులకే ఆలౌటైంది. తొలి రోజు సెంచరీ హీరో కేఎల్‌ రాహుల్‌ (129; 250 బంతుల్లో 12×4, 1×6) ఓవర్‌నైట్‌ స్కోరుకు రెండు పరుగులే జోడించాడు. జడేజా (40; 120 బంతుల్లో 3×4), పంత్‌ (37; 58 బంతుల్లో 5×4) పోరాడబట్టి ఆ స్కోరైనా సాధ్యమైంది. అండర్సన్‌ (5/62) భారత్‌ను గట్టి దెబ్బ తీశాడు. ఓలీ రాబిన్సన్‌ (2/73), మార్క్‌వుడ్‌ (2/91) కూడా రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ శుక్రవారం ఆట ఆఖరుకు 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. మహ్మద్‌ సిరాజ్‌ (2/34) వరుస బంతుల్లో సిబ్లీ (11), హమీద్‌ (0)లను ఔట్‌ చేసి బౌలింగ్‌లో భారత్‌కు అదిరే ఆరంభాన్నిచ్చాడు. అయితే 23/2తో కష్టాల్లో పడ్డ ఇంగ్లాండ్‌ను రోరీ బర్న్స్‌ (49; 136 బంతుల్లో 7×4), జో రూట్‌ (48 బ్యాటింగ్‌; 75 బంతుల్లో 6×4) ఆదుకున్నారు. వీళ్లిద్దరూ ఎంతో పట్దుదలతో క్రీజులో నిలవడంతో ఇంగ్లాండ్‌ 108/2తో మంచి స్థితికి చేరుకుంది. ఆట చివర్లో షమి.. బర్న్స్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని భారత్‌కు కాస్త ఉపశమనాన్నిచ్చాడు. ఆట ఆఖరుకు రూట్‌కు తోడుగా బెయిర్‌స్టో (6) క్రీజులో ఉన్నాడు. మూడో రోజు బౌలర్లు ఏమేర రాణిస్తారన్న దాన్ని బట్టి మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది.

అంత మంచి స్థితి నుంచి..: రెండో రోజు ఉదయం భారీ స్కోరు ఆశలతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగిలాయి. ఇలా ఆట ఆరంభమైందో లేదో.. అలా రెండు వికెట్లు పడిపోయాయి. డబుల్‌ సెంచరీ చేసే ఊపులో కనిపించిన తొలి రోజు హీరో రాహుల్‌.. ఆట తొలి ఓవర్లోనే వెనుదిరిగాడు. అతడి మేటి ఇన్నింగ్స్‌కు ఓలీ రాబిన్సన్‌ తెరదించాడు. తర్వాతి ఓవర్లో రహానె (1)ను అండర్సన్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో 276/3తో ఆట కొనసాగించిన భారత్‌.. 282/5కు చేరుకుంది. ఈ స్థితిలో పంత్‌, జడేజా పోరాడారు. పంత్‌ తనదైన శైలిలో షాట్లు ఆడితే.. జడేజా ఆచితూచి బ్యాటింగ్‌ చేశాడు. దీంతో భారత్‌ 331/5తో పుంజుకున్నట్లే కనిపించింది. కానీ వుడ్‌.. పంత్‌ను ఔట్‌ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. షమి (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఈ దశలో ఇషాంత్‌ (8) సహకారంతో జడేజా స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 362/7కు చేరుకున్న భారత్‌.. 400 మార్కు దాటుతుందనిపించింది. కానీ ఇషాంత్‌ వికెట్‌ పడగానే ఇన్నింగ్స్‌ ఎంతోసేపు సాగలేదు. 2 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌ 364 పరుగులకే ఆలౌటైంది. జడేజా చివరి వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) అండర్సన్‌ 83; రాహుల్‌ (సి) సిబ్లీ (బి) రాబిన్సన్‌ 129; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్‌ 9; కోహ్లి (సి) రూట్‌ (బి) రాబిన్సన్‌ 42; రహానె (సి) రూట్‌ (బి) అండర్సన్‌ 1; పంత్‌ (సి) బట్లర్‌ (బి) వుడ్‌ 37; జడేజా (సి) అండర్సన్‌ (బి) వుడ్‌ 40; షమి (సి) బర్న్స్‌ (బి) అలీ 0; ఇషాంత్‌ ఎల్బీ (బి) అండర్సన్‌ 8; బుమ్రా (సి) బట్లర్‌ (బి) అండర్సన్‌ 0; సిరాజ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (126.1 ఓవర్లలో ఆలౌట్‌) 364

వికెట్ల పతనం: 1-126, 2-150, 3-267, 4-278, 5-282, 6-331, 7-336, 8-362, 9-364; బౌలింగ్‌: అండర్సన్‌ 29-7-62-5; ఓలీ రాబిన్సన్‌ 33-10-73-2; సామ్‌ కరన్‌ 22-2-72-0; మార్క్‌ వుడ్‌ 24.1-2-91-2; మొయిన్‌ అలీ 18-1-53-1

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: రోరీ బర్న్స్‌ ఎల్బీ (బి) షమి 49; సిబ్లీ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 11; హమీద్‌ (బి) సిరాజ్‌ 0; రూట్‌ బ్యాటింగ్‌ 48; బెయిర్‌స్టో బ్యాటింగ్‌ 6; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (45 ఓవర్లలో 3 వికెట్లకు) 119; వికెట్ల పతనం: 1-23, 2-23, 3-108; బౌలింగ్‌: ఇషాంత్‌ 11-2-32-0; బుమ్రా 9-3-23-0; షమి 8-2-22-1; సిరాజ్‌ 13-4-34-2; జడేజా 4-1-6-0
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన