వైకల్యం ఉందని అనుకోను
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 29/08/2021 02:23 IST

వైకల్యం ఉందని అనుకోను

ఈనాడు క్రీడావిభాగం

తనకు వైకల్యం ఉందన్న భావన ఎప్పుడూ కలగదని భవీనా పటేల్‌ చెప్పింది. సాధ్యం కానిది ఏదీ లేదనే సూత్రాన్నే నమ్ముతానని చెబుతున్న ఆమె.. టీటీ కోసం అన్నపానాలు కూడా మరిచిపోయేదాన్నని చెప్పింది ఇంక భవీనా ఏం అందో ఆమె మాటల్లో..

నేను వికలాంగురాలిని అనే ఆలోచనే ఎప్పుడూ రాదు. ఏదైనా సాధించగలనని ఎల్లవేళలా ఆత్మవిశ్వాసంతో ఉంటా. టేబుల్‌ టెన్నిస్‌లో మాత్రమే కాదు ఇతర విషయాల్లోనూ ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు రుజువు చేశా కూడా. చైనా క్రీడాకారిణులపై గెలవడం చాలా కష్టం అనేది అందరికి తెలుసు. కానీ నేను ఏదీ అసాధ్యం కాదని నిరూపించా. చైనా అమ్మాయిని ఓడించా.

రోబో సాయంతో..

మాది చిన్న పల్లెటూరు. అసలు టీటీ అనే ఆట ఒకటి ఉంటుందనే విషయమే తెలియదు. కానీ చదువు కోసం 2004లో అహ్మదాబాద్‌ ఐటీఐకి వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది. కంప్యూటర్‌ కోర్సు చేయడానికి ఇక్కడికి వచ్చిన నేను క్రీడాకారిణిగా మారిపోయా అంటే కోచ్‌ లలాన్‌ దోషి పుణ్యమే. మొదట సరదాగా ఈ ఆట ఆడేదాన్ని. దిల్లీలో జరిగిన జాతీయ టోర్నీలో కాంస్యం గెలవడంతో టీటీని సీరియస్‌గా తీసుకున్నా. ఆపై ఆటలో మమేకమైపోయా. ఎంతగా అంటే తిండీ తిప్పలు మరిచిపోయేంతగా ఈ టేబుల్‌ టెన్నిస్‌కి అతుక్కుపోయేదాన్ని. టాప్స్‌ (టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌)లో చోటు దక్కిన తర్వాత నా కోసం ఓ రోబో కేటాయించారు. ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్న ఆ రోబోతో ఆడుతూ ఆటను బాగా మెరుగుపరుచుకున్నా. 2011లో బ్యాంకాక్‌ అంతర్జాతీయ టోర్నీలో రజతం గెలవడం నా కెరీర్‌లో మలుపు.

యోగా, ధ్యానం

ఉదయం 4 గంటలకు లేవడంతో నా దినచర్య ప్రారంభమవుతుంది. మనసుని ప్రశాంతంగా ఉంచడంపైనే దృష్టి కేంద్రీకరిస్తా. ఇందుకోసం యోగా, ధాన్యం చేస్తా. మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో తప్పులు చేస్తుంటాం. తొందరలో పాయింట్లు కోల్పోతుంటాం. ఇలాంటి సమయంలో సంయమనంతో ఉండటానికి, ఆలోచనలు నియంత్రించుకోవడం కోసం ధ్యానం ఉపయోగపడుతుంది. సెమీఫైనల్లో జంగ్‌తో మ్యాచ్‌లోనూ నేను అందుకే అంత ప్రశాంతంగా ఉన్నా.

వారి వల్లే సాధ్యమైంది

మా కోచ్‌ల వల్లే నా ఆట మెరుగైంది. ఆటలో మరింత నైపుణ్యాన్ని సాధించడం కోసం వారెన్నో చిట్కాలు చెప్పారు. అందుకే ఈ స్థితికి రాగలిగాను. క్రీడాకారులకు ఆర్థిక సాయం లేకుండా ఎదగడం కష్టం. మధ్యతరగతికి చెందిన నాలాంటి వాళ్లు ఖర్చులు భరించి టోర్నమెంట్లకు వెళ్లలేరు. కానీ సాయ్‌, టాప్స్‌, భారత పారాలింపిక్‌ కమిటీ, ఒలింపిక్‌ గోల్డ్‌ క్వెస్ట్‌ తదితర సంస్థల ద్వారా నాకెంతో సాయం అందింది. అందరికి రుణపడి ఉంటాను. నా తల్లిదండ్రులతో పాటు నా భర్త అందించిన మద్దతు ఎంతో గొప్పది.


‘‘అభినందనలు భవీనా పటేల్‌. గొప్ప ప్రదర్శన చేశావ్‌. ఫైనల్లో స్వర్ణం గెలవాలని దేశం అంతా కోరుకుంటోంది. తుది పోరులో ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి స్థాయిలో రాణించేందుకు ప్రయత్నించు. నువ్వు సాధించిన విజయాలతో భారత్‌ స్ఫూర్తి పొందుతోంది’’

 ప్రధాని నరేంద్ర మోదీ


 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన