సీఎస్కేకు ఎదురుదెబ్బ
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 16/09/2021 04:05 IST

సీఎస్కేకు ఎదురుదెబ్బ

దిల్లీ: ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌ యూఏఈలో ఆరంభం కానున్న రెండో దశ ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శనను కొనసాగించాలనుకుంటోంది. 19న ముంబయి ఇండియన్స్‌తో పోరుతో టైటిల్‌ వేటను మొదలెట్టనుంది. అయితే ఆ మ్యాచ్‌కు ముందే ధోని జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. క్వారంటైన్‌లో ఉండాల్సిన కారణంగా ఆల్‌రౌండర్‌ సామ్‌ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. గాయం కారణంగా డుప్లెసిస్‌ ఆడడం కూడా అనుమానంగా మారింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ సీజన్‌ తొలి దశలో చెన్నై తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశారు. కొన్ని రోజుల కింద కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో ఆడుతుండగా డుప్లెసిస్‌కు గజ్జల్లో గాయమైంది. ముంబయితో మ్యాచ్‌ సమయానికి అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని ఆశిస్తున్నారు. కరన్‌ మాత్రం ఆడే అవకాశం లేదు. అతడు బుధవారమే యూఏఈ చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం బ్రిటన్‌ నుంచి వచ్చిన వారు అక్కడ ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన