కేరింతలు మళ్లీ మొదలు
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 16/09/2021 04:05 IST

కేరింతలు మళ్లీ మొదలు

దిల్లీ: ఐపీఎల్‌లో ప్రేక్షకుల సందడే వేరుగా ఉంటుంది. తమ అభిమాన బ్యాట్స్‌మెన్‌ బ్యాట్‌తో చెలరేగుతుంటే.. బౌలర్లు వికెట్లతో విజృంభిస్తుంటే.. అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాలకు.. కళ్లు చెదిరే క్యాచ్‌లకు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తూ.. చప్పట్లు, కేరింతలు, నృత్యాలతో మ్యాచ్‌కు మరింత జోష్‌ను అందించేది ప్రేక్షకులే. కానీ కరోనా కారణంగా.. గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌కు.. ఈ ఏడాది మేలో అర్ధంతరంగా ఆగిపోయిన 14వ సీజన్‌ తొలి భాగానికి ప్రేక్షకులను అనుమతించలేదు. కృత్రిమ శబ్దాలతోనే పని కానిచ్చారు. కానీ ఇప్పుడు యూఏఈలో తిరిగి ఆరంభం కానున్న ఐపీఎల్‌ 14 రెండో దశ మ్యాచ్‌ల్లో మళ్లీ ఆ కేరింతలు, సందడిని చూడబోతున్నాం. ఆదివారం ఆరంభమయ్యే లీగ్‌ మ్యాచ్‌లను చూసేందుకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించనున్నట్లు ఐపీఎల్‌ నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. దుబాయ్‌లో ముంబయి, చెన్నై మధ్య మ్యాచ్‌తో ప్రేక్షకులు తిరిగి ఐపీఎల్‌ మజాను ఆస్వాదించేందుకు వచ్చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన