ఇప్పుడు టోక్యో.. తర్వాత పారిస్‌
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 23/09/2021 02:29 IST

ఇప్పుడు టోక్యో.. తర్వాత పారిస్‌

దిల్లీ: ఒలింపిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణాన్ని అందించిన షూటర్‌ అభినవ్‌ బింద్రా.. ఒలింపిక్‌ అథ్లెటిక్స్‌లో పసిడి గెలిచిన తొలి భారత క్రీడాకారుడైన నీరజ్‌ చోప్రాను ప్రత్యేకంగా కలిసి అభినందించాడు. అతనికి ఓ బుజ్జి కుక్క పిల్లను బహుమతిగా అందించాడు. ‘‘భారత బంగారు బుల్లోడు నీరజ్‌ను కలిసి  అతనితో మాట్లాడటం ఎంతో సంతోషాన్నిచ్చింది. ‘టోక్యో’ ఓ మంచి స్నేహితుడిగా ఉంటుందని అనుకుంటున్నా. అలాగే తనకు 2024లో పారిస్‌ రూపంలో మరో తోడు పొందేలా నీరజ్‌ను అది ప్రేరేపిస్తుందని నమ్ముతున్నా’’ అనే వ్యాఖ్యలతో పాటు నీరజ్‌కు కుక్కపిల్లను అందిస్తున్న ఫొటోను బింద్రా బుధవారం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. నీరజ్‌ ఇంటికెళ్లి అభినందించిన బింద్రాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభినవ్‌ 2008  ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన