మిక్స్‌డ్‌లోనూ పసిడి పోరుకు సురేఖ
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 24/09/2021 02:05 IST

మిక్స్‌డ్‌లోనూ పసిడి పోరుకు సురేఖ

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

యాంక్టాన్‌ (యుఎస్‌): తెలుగమ్మాయి జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో మరో స్వర్ణం ముంగిట నిలిచింది. ప్రియ, ముస్కాన్‌లతో కలిసి కాంపౌండ్‌ మహిళల టీమ్‌ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లిన జ్యోతి సురేఖ.. అభిషేక్‌ వర్మతో కలిసి మిక్స్‌డ్‌ విభాగంలో ఫైనల్‌ పోరుకు అర్హత పొందింది. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ మిక్స్‌డ్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన భారత తొలి జోడీగా సురేఖ, అభిషేక్‌ ఘనత సాధించారు. గురువారం సెమీస్‌లో సురేఖ, అభిషేక్‌ వర్మ జంట 159-156తో యన్‌హి-జాంగ్‌ హో (కొరియా)లపై నెగ్గింది. అంతకుముందు క్వార్టర్స్‌లో సురేఖ ద్వయం 157-155తో సనె-మైక్‌ (నెదర్లాండ్స్‌) జోడీని ఓడించింది. శుక్రవారం కాంపౌండ్‌ మహిళల టీమ్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాల్లో ఫైనల్స్‌ జరగనున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ ఆర్చరీ కాంపౌండ్‌ టీమ్‌ విభాగాల్లో భారత్‌ గెలిచిన అన్ని పతకాల్లో సురేఖ భాగమవడం విశేషం. వ్యక్తిగత విభాగంలోనూ జ్యోతి సురేఖ పతకం దిశగా సాగుతోంది. ఆమె క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. గురువారం ప్రిక్వార్టర్స్‌లో సురేఖ 146-142తో కొరియా క్రీడాకారిణి సో చేవన్‌ను ఓడించింది. అంతకుముందు రౌండ్లో సురేఖ 147-144తో వాండర్‌వెన్‌ (నెదర్లాండ్స్‌)ను ఓడించింది. తొలి రెండు రౌండ్లలో సురేఖకు బై లభించిన సంగతి తెలిసిందే. శనివారం క్వార్టర్‌ఫైనల్లో సురేఖ క్రొయేషియా ఆర్చర్‌ అమందను ఢీకొననుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన