టెస్టులకు మొయిన్‌ అలీ వీడ్కోలు
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 28/09/2021 02:33 IST

టెస్టులకు మొయిన్‌ అలీ వీడ్కోలు

లండన్‌: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ టెస్టు క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కెరీర్‌ను పొడిగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ‘‘నాకిప్పుడు 34 ఏళ్లు. వీలైనంత ఎక్కువకాలం క్రికెట్‌ ఆడాలనుకుంటున్నా. ఆటను ఆస్వాదించాలనుకుంటున్నా. టెస్టు క్రికెట్‌ గొప్పది. బాగా ఆడిన రోజు ఇతర ఫార్మాట్ల కంటే చాలా గొప్పగా ఉంటుంది. నేను టెస్టు క్రికెట్‌ను ఆస్వాదించా. కానీ కొన్ని సార్లు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక టెస్టు క్రికెట్‌ చాలనిపించింది. ఈ ఫార్మాట్లో నేను సాధించినదాని  పట్ల సంతోషంగా, సంతృప్తిగా ఉన్నా’’ అని అలీ చెప్పాడు. అతను 64 టెస్టుల్లో 2,914 పరుగులు చేసి, 195 వికెట్లు పడగొట్టాడుAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన