గాయంతో కుల్‌దీప్‌ ఇంటికి
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 28/09/2021 02:33 IST

గాయంతో కుల్‌దీప్‌ ఇంటికి

దిల్లీ: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు మోకాలికి గాయమైంది. దీంతో అతడు యుఏఈ నుంచి తిరిగొచ్చేశాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కుల్‌దీప్‌ ఐపీఎల్‌తో పాటు త్వరలో జరిగే దేశవాళీ పోటీల్లో కూడా దూరం కానున్నాడు. ‘‘యూఏఈలో ప్రాక్టీస్‌ సెషన్లో భాగంగా ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో కుల్‌దీప్‌ మోకాలికి గట్టి దెబ్బ తగిలింది. బంతి పట్టే క్రమంలో మోకాలు మడతపడింది. ఐపీఎల్‌లో ఇక ఆడే అవకాశం లేకపోవడంతో అతడు స్వదేశానికి వచ్చేశాడు’’ అని బీసీసీఐ అధికారి వెల్లడించాడు. కుల్‌దీప్‌ మోకాలికి శస్త్ర చికిత్స అవసరమని.. అతడు మళ్లీ మైదానంలోకి రావడానికి నాలుగు నుంచి అయిదు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. 2019 ఐపీఎల్‌ తర్వాత కుల్‌దీప్‌ మళ్లీ మైదానంలో ఎక్కువ కనబడలేదు. ఇటీవలే శ్రీలంకతో  సిరీస్‌లో అతను పునరాగమనం చేశాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన