క్వార్టర్స్‌ ఆశలు ఆవిరి
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 28/09/2021 02:37 IST

క్వార్టర్స్‌ ఆశలు ఆవిరి

చైనా చేతిలో భారత్‌ ఓటమి

వాంటా (ఫిన్లాండ్‌): సుదిర్మన్‌ కప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌ ఆశలు ఆవిరయ్యాయి. గ్రూపు-ఎ రెండో పోరులోనూ ఓడటంతో క్వార్టర్స్‌ రేసు నుంచి భారత్‌ నిష్క్రమించింది. సోమవారం జరిగిన పోరులో భారత్‌ 0-5తో చైనా చేతిలో పరాజయం చవిచూసింది. తొలుత పురుషుల డబుల్స్‌లో అర్జున్‌- ధ్రువ్‌ కపిల్‌ 20-22, 17-21తో చెంగ్‌- డాంగ్‌ చేతిలో ఓడారు. మహిళల సింగిల్స్‌లో అదితి భట్‌   9-21, 8-21తో ఒలింపిక్‌ ఛాంపియన్‌ చెన్‌ యుఫెయ్‌ చేతిలో పరాజయం చవిచూసింది. అనంతరం పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ 10-21, 10-21తో షై యుకి చేతిలో ఓడటంతో చైనా 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప  16-21, 13-21తో జెంగ్‌ యు- వెన్‌ మీ చేతిలో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌- రుతుపర్ణ 9-21, 9-21తో డు యు- ఫెంగ్‌ యాన్‌ చేతిలో పరాజయం చవిచూడటంతో 5-0తో చైనా విజయం సాధించింది. వరుసగా రెండు ఓటములతో క్వార్టర్స్‌కు దూరమైన భారత్‌ బుధవారం జరిగే నామమాత్రమైన చివరి గ్రూపు పోరులో ఫిన్లాండ్‌ తలపడుతుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన